ఇది రైతుల ప్రభుత్వం
` పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు
` జెండా ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు.అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు.’’వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక. 25 లక్షల మందికిపైగా రైతుల రుణమాఫీ చేశాం. ప్రజాప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తోంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నాం. సన్నరకం బియ్యానికి బోనస్ అందించాం. 2024 వానా కాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశాం. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ.4,500 కోట్లు ఆదా అయ్యింది. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నాం. యువత సాధికారత కోసం యంగ్‌ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశాం. ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తోంది. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం’’ అని గవర్నర్ వెల్లడిరచారు.