ఢిల్లీ: ప్రదర్శనకారులను అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు ఇవాళ చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిజాము ద్దీన్ నుంచి ఇండియా గేట్ వరకు తల పెట్టిన ఈ మార్చ్‌ను జాకీర్ హుసేన్ మార్గ్‌లో నిలువరించారు. ఇండియా గేట్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదంటున్న పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులు అక్కడే ఉన్నట్లు సమాచారం తెలిసింది.