తక్కువ నీరు ఎక్కువ సాగు

4

– వ్యవసాయరంగంలో నూతన ఒరవడి

– ప్రధాని మోదీ

బెంగళూరు,ఫిబ్రవరి 27(జనంసాక్షి):పేదలు, రైతుల జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. తక్కువ నీరు.. ఎక్కువ సాగు నినాదంతో ముందుకు వెళ్తున్నాం. సూక్ష్మ  సేద్యం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టగలుగుతున్నామని అన్నారు.  గత 18 నెలలుగా ప్రజలకు ప్రధాన సేవకుడిగా పని చేశానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కర్ణాటకలోని బెళగావిలో కిసాన్‌ ర్యాలీలో మోడీ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని ఎంతో ప్రోత్సహించాం.. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. భూసార పరీక్ష కార్డులను జారీ చేశామన్నారు. నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.ఇప్పుడు భారత్‌ ఆశా రేఖ లాంటిదని యావత్‌ ప్రపంచం చెబుతుందని గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యమంలోనూ భారత్‌ వృద్ధిరేటు తగ్గలేదు అని తెలిపారు. . వ్యవసాయం, తయారీ రంగం, సేవా రంగాల అభివృద్ధి ద్వారానే ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కోవచ్చని మోదీ పేర్కొన్నారు.