తడి పొడి విధానం వల్ల మీథేన్ వాయువును తగ్గించవచ్చు.
డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కరాచారి.
తొర్రూర్ 9అక్టోబర్ (జనంసాక్షి ) మండల కేంద్రంలోని గోపాలగిరి, చెర్లపాలెం, చీకటయపాలెం లో కొర్ కర్బన్ ఎక్స్ సొల్యూషన్ ప్రవేటు లిమిటెడ్ మరియు చేయూత గ్రామీణ మహిళా అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలోతాడిపోడి విధానం పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కరాచారి మాట్లాడుతూ పర్యావరణం కాలుష్యం కాకుండా రైతులు పండించే పంటలలో భాగంగా వరి పంట లో తడి పొడి విధానం వల్ల మితేను అనే వాయువును తగ్గించడంలో వరి పంటకు ఎక్కువ రోగాలు రాకుండా పరి రక్షించ వచ్చని అన్నారు. ఈ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు లో భాగంగా మితేను అనబడే కాలుష్య కారకం విడుదల తగ్గుతుంది. హైడ్రోజన్ సెలైఫెడ్ వరి కి హాని కలగకుండా ఉంటుంది. వరిదుబ్బ మరియు కంకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన చేను పడిపోదు. అదేవిధంగా నేల భౌతిక పరిస్థితులు మెరుగు పడటమేకాకుండా యంత్రం ద్వారా కోతకు అనుకూలంగా ఉంటుంది. వరి పొలాల్లో మెరుగైన నీటి నివారణ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ మార్కెట్ నుండి అదనపు ఆదాయాన్ని పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆర్డినేటర్ సురేష్. గ్రామ రైతులు. వెంకన్న యాకుబు. యాకయ్య. దస్తగిరి. వెంకన్న. మంగారెడ్డి. రామచ్చేందరూ. వెంకన్న.శ్రీనివాస్, సతీష్. దర్గయ్య,తదితరులు పాల్గొన్నారు.
—