-తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

కన్నాయిగూడెం,జూలై 20(జనంసాక్షి):-
నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత విలువలను ప్రతిష్టను కించపరుస్తున్న “యూ” న్యూస్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్, మోగుల్ల భద్రయ్యల పై చర్యలు తీసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు కన్నాయిగూడెం వారికి లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. విషయం పూర్వపరాలలోకి వెళితే రాజ్యంగబద్దముగా ప్రజల చేత -శాసనసభకు ఎన్నుకోబడిన ములుగు ఎమ్మెల్యే సీతక్క నిత్యము ప్రజల మధ్యలోనే వుంటూ వారు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. ములుగు సబ్ రిజిస్ట్రారుగా పరిచేస్తున్న తస్లీమా మహ్మద్ కూడ అత్యంత సాధారణ జీవితము గడుపుతూ విధి నిర్వహణలో ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడమే కాకుండా ఆపన్నులను, ఆధారాలను చేరదిస్తున్నారు.ఎమ్మెల్యే సీతక్క, సబ్ రిజిష్టారు తస్లీమా మహ్మద్ కఠిన లాఠీ డౌన్ సమయములో మారుమూల అటవీ గ్రామాలకు కాలినడకన వెళ్ళి నిరుపేద అదివాసీలకు పెదలకు అన్ని వర్గాల వారికి నిత్యావసరాలు అందించి వారి కన్నీళ్లు తుడుచారు. “యూ” న్యూస్ యూట్యూబ్ ఛానెల్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్ తన ఛానల్లో విరిద్దరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే సీతక్కను భూకబ్జా కోరుగా చిత్రికరిస్తూ తీవ్ర పదజాలాన్ని ఉయోగించారు. సబ్ రిజిస్ట్రారు తస్లీమాకు సహకరిస్తున్నారు అని నిరాదరణ ఆరోపణలు చేశారు.ఇద్దరు మహిళలు సమాజములో గుర్తింపు వున్న వారిని అని చూడకుండా అభ్యంతరకరమైన అహభావాలను ప్రదర్శిస్తూ కించపరచలా మాట్లదారు.ఇది అత్యంత హైయమైన చర్యగా ప్రజలు బావిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా చెప్పుకునే మోగుల్ల భద్రయ్య అనే వ్యక్తి చిలుక ప్రవీణ్ కు తప్పుడు సమాచారము ఇచ్చి ఎమ్మెల్యే సీతక్క, సబ్ రిజిష్టారు తస్లీమా మహ్మద్ పై ఆరోపణలు చేయించడము సమంజసం కాదన్నారు.ఈ సమాచారాన్ని య్యూటూబ్ చానల్ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ విషయాలపై  విచారణ జరిపి “యూ”న్యూస్ య్యూటూబ్ చానల్ రిపోర్టర్ చిలుక ప్రవీణ్, మోగుల్ల భద్రయ్యపై చట్టరీత్యా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోగలరని కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు కోరారు.