తరాలు మారుతున్న ఆదివాసీల తలరాతలు మారలే

-దబ్బగట్ల శ్రీకాంత్,
ఆదివాసి విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు.
కన్నాయిగూడెం, జూలై 8(జనంసాక్షి):-

స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆదివాసి బతుకులు మారలేదు.ఎన్ని  ప్రభుత్వాలు మారిన ఆదివాసి గ్రామాలకు కనీసం సరిఅయిన రోడ్డు సౌకర్యం లేక అమాయక ఆదివాసీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.విపత్కర సమయాలలో ఆదివాసీల ప్రాణాలు పోయినా ప్రభుత్వాలు కనీసం ఆదివాసుల గూడేలలో అభివృద్ధిపై ఒక్క అడుగు ముందుకు పడిన దాకాలలు లేవు. కానీ ప్రభుత్వం కొన్ని నగరాలకు స్మార్ట్ సిటీలుగా మార్చడం కోసం నగరాలకు బడ్జెట్ కేటాయిస్తున్నారు.ఆదివాసీల కోసం దేశంలో ఎందుకు బడ్జెట్ కేటాయించడం లేదు కానీ ఓట్లు కోసం వస్తారు కానీ ఆదివాసి మార్పు కోసం ఏ రాజకీయ పార్టీ రాదు రాష్ట్ర ప్రభుత్వం అధివాసుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు.  ఆదివాసి ప్రజలారా ఆదివాసి మేధావులారా  యువత ఆదివాసి రైతులు మరో సమ్మక్క సారలమ్మ పోరాటానికి సిద్ధం కావాలని కొమరం భీమ్ పోరాటం, బిర్సా ముండా  మీరు త్యాగాల ఫలితంగా జీవన్ కడుపుతున్న మరో పోరాటానికి సిద్ధం కావాలని కోరుతున్నాం అని కంతనపల్లి గ్రామం కన్నాయిగూడెం మండలం ములుగు జిల్లా ఆదివాసి విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు దబ్బ గట్ల శ్రీకాంత్