తర్నం గ్రామాన్ని సందర్శించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.

నెరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి):సిజనల్ వ్యాదికి చిన్న పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ అక్షిత అన్నారు.మండలంలోని తర్నం గ్రామంలో బుధవారం రోజున వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ అక్షిత సందర్శించారు. ఇమునైజేషన్ గురించి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది వారితో అడిగి తెలుసుకున్నారు.ఇంటింటికి తిరిగి చిన్నారులకు క్రమం తప్పకుండా నేలవారి ఇంజక్షన్ తీసుకోవాలని సీజనల్ వ్యాధిపట్ల అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి నీటినిల్వ ఉండకుండా  చూసుకోవాలని,నీటి నిల్వల వలన దోమల లార్వాచే దోమలు అధికంగా పెరిగి వాటి వలన మలేరియా డెంగ్యూ వంటి వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో డబ్ల్యూ హెచ్ ఓ డాక్టర్ అక్షిత తోపాటు డా. లావణ్య ఎఎన్ఎం శ్యామల గంగామణి ఆశవర్కర్ ఆనంద బాయి అంగన్వాడీ టీచర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.