తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉంది -టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ కార్యదర్శి రోనాల్డ్ రోస్…
హన్మకొండ బ్యూరో చీఫ్ 17అక్టోబర్ జనంసాక్షి
సోమవారం నాడు ఆయన హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐటిడిఎ పిఓ అంకిత్, కమిషనర్ ప్రవీణ్యా తో కలసి మడికొండ లో గల ప్రభుత్వ సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ పాఠశాల, వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సెక్రటరీ అన్ని విభాగాలను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల తో ముచ్చట్టించారు.కిచెన్, డార్మెటరీ, స్టోర్‌రూమ్, లైబ్రరీ వద్ద ఉన్న వసతులను స్వయంగా పరిశీలించారు. స్టోర్ రూమ్ లో ఉన్న మిగిలిన మెటీరియల్ ను సత్వారమే విద్యార్థులు అందిచలని ఆదేశించారు.విద్యార్థినుల కోసం సిద్ధం చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల తో కలసి భోజనం చేసారు.వారి ఆరోగ్య స్థితిగతులు, అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నా యా..అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూ చించారు. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. హాస్టల్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఆహార పదార్థాలను వెస్ట్ చేయరాదు అని అన్నారు.హాస్టల్ కు వచ్చిన వస్తువులు ను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. చిన్న చిన్న రిపేర్ లను తక్షణమే చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్సిఓ విద్యా రాణీ, ప్రినిస్పాల్ ఉమా మహేశ్వరి, తదితులున్నారు.