తల్లితండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించే కొడుకుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి

మునగాల, జూలై 8(జనంసాక్షి): తల్లితండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించే కొడుకుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు శుక్రవారం లేఖ రాశారు. ఎందరో తల్లి తండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు ఎన్నో కష్టాలు పడి వారికి ఆస్తులను ధనమును ఉన్నత చదువులను మంచి ఉద్యోగం ఇతర రాజకీయ పదవులు ఇచ్చి చివరకు వారు వృద్ధాప్యం వచ్చేసరికి వారిని అమానుషంగా బయటకు గెంటేసి కనీస మానవత్వం మరిచి ఒక్కపూట భోజనం కూడా పెట్టకుండా అందరూ ఉన్నా అనాథలుగా వదిలివేసే కసాయి కొడుకులకు తగిన గుణపాఠం చెప్పాలని, అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వారి జీతంలో సగం తల్లితండ్రులకు, ఇతరులైతే ప్రభుత్వం నుంచి అందించే వివిధ సంక్షేమ పథకాలు వారి తల్లితండ్రులకు అందించే విధంగా సామాన్య కుటుంబాలు సైతం విధిగా చూసుకునేలా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి విన్నవించారు. ఇక రాజకీయ నాయకులు అయితే  అలాంటి వారికి ఎలక్షన్లో పోటీ చేయకుండా అనహర్లుగా ప్రకటించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకుంటారని తన అభిప్రాయం లేఖ ద్వారా వ్యక్తం చేశారు. నిరాదరణకు గురవుతున్న తల్లితండ్రుల పట్ల సరైన నిర్ణయం తీర్పు ఒక శాసనం ద్వారా ఒక మంచి తీర్పు ఇస్తారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక దిశా నిర్దేశం చేయాలని కోరారు.దేశంలో పిల్లలు ఉన్న ఏ కన్న తల్లిదండ్రులు అనాధలుగా  ఉండకూడదని, ఆకలితో అలమటించకూడదని, అనాధలుగా కాలం చేయకూడదనే కోరిక అని అన్నారు.

తాజావార్తలు