తల్లిని హతమార్చిన తనయుడు
– తండ్రి పరిస్థితి విషమం
వరంగల్ : జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులపై ఓ కసాయి కొడుకు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.