తల్లీ కూతుళ్లను కాపాడిన కానిస్టేబుల్‌

కృష్ణాలో మునిగిపోతుండగా రక్షణ

జోగులాంబగద్వాల,నవంబర్‌19(జనం సాక్షి  ) : కృష్ణా నదిలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలు, తల్లిని ఓ పోలీస్‌ కాపాడాడు.ఈ సంఘటన జోగులాంబ గద్వాల్‌ జిల్లా  బీచుపల్లి దగ్గర జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం  కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓ తల్లి తన పిల్లలతో కలిసి దీపాలు పెట్టడానికి బీచుపల్లికి వచ్చారు. దీపం పెడుతుండగా అకస్మాత్తుగా పాప నీళ్లలో పడిరది. పాప కోసం రెండో పాప కూడా నీళ్లలో దిగింది. వారిని కాపాడడం కోసం తల్లి కూడా దిగడంతో ముగ్గురు మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కృష్ణా సాగర్‌ అనే కానిస్టేబుల్‌ అయ్యప్ప మాల వేసుకొని అక్కడ నదికి పూజలు చేస్తున్నాడు. ముగ్గురు నదిలో మునిగిపోతుండగా గుర్తించి వెంటనే వారిని నీళ్లలో నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న జాలర్లు సహాయం కూడా చేశారు. దీంతో తన ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ కు తల్లి బిడ్డలు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్‌ కృష్ణసాగర్‌ స్వస్థలం వనపర్తి జిల్లా.