తహశల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
జనంసాక్షి/ చిగురుమామిడి – అక్టోబర్ 2:
మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతి కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు.గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, ఆర్ఐ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ భగత్ తదితరులు పాల్గొన్నారు.