తహశీల్దార్ ఎదురుగానే బాహాబాహి
భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి) :
తాగు నీటి బోరు మాదంటే మాదని తహశీల్దార్ ఎదురుగానే ఇరువర్గాల మధ్యఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని నర్సింగాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఎస్సీ కాలనీలో గుండారపు బాస్కర్‌రావు అనే దాత ఉచితంగా బోర్ వేయించాడు. దానికి కాలనీలో ఒక వర్గం సొంత డబ్బులతో మోటర్ బిగించుకుని, పైపుల ద్వార నేరుగా తమ ఇళ్లకు తీసుకుంటున్నారు. మరో వర్గం సదరు బోరు నీటిని వాడుకునే హక్కు మాకు కూడా ఉందని వారం రోజుల క్రితం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కాగా గురువారం గ్రామానికి విచారణ నిమిత్తం వచ్చిప తహశీల్దార్ ఎదురుగానే ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. దాంతో ఎస్సై ఎర్రల కిరణ్ కుమార్ ఇరువర్గాలకు సర్ది చెప్పి శాంతింప చేశారు.