తహసిల్దార్ కార్యాలయం దిగ్బంధం చేసిన వీఆర్ఏలు

. ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు జిఓ తక్షణమే ప్రకటించాలి
… జిల్లా విఆర్ఏ జేఏసీ చైర్మన్ తాళ్ళపల్లి  జయరాజ్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 10, ( జనం సాక్షి ) :
గత 77 రోజులుగా  వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వారి డిమాండ్ల సాధనకై నిర వధిక సమ్మె చేస్తుందని, ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు జిఓ తక్షణమే ప్రకటించాలని,త్వరలో ప్రభు త్వం న్యాయం చేస్తుందని, ఆ దిశగా తప్పకుండా అడుగులు వేస్తుందని జనగామ జిల్లా విఆర్ఏల జేఏసీ చైర్మన్ తాళ్లపల్లి జయరాజ్ అన్నారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తహశీల్దార్ కార్యాలయాల దిగ్భందం కార్యక్రమంలో బాగంగా డివిజన్ కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయం వీఆర్ఏలు దిగ్భం దం  చేశారు. ఈ కార్యక్రమంలో జయరాజ్ పాల్గొ ని మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన కోర్కెలు ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని, తమ మూడు డిమాండ్లు తప్పకుండా పరిష్కరిస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ రెండు మూడు రోజులలో రాష్ట్ర జేఏసీచర్చలుజరుగుతాయని వేచి చూస్తుం దని ఆయన అన్నారు.ఒకవేళ ప్రభుత్వంచర్చలకు పిలువని పక్షంలో సమ్మె ను ఉద్రృతం చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈనెల 12వ తేదీ రోజున రాష్ట్రంలో విఆర్ఏ ల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఉందని ఇందులో అన్ని రకాల నాయకులు పాల్గొంటారని అన్నారు. అలాగే 15 ,16 తేదిలలో యాదాద్రి నుండి ప్రగతి భవన్ కు పాదయాత్ర కొనసాగుతుందని  రాష్ట్రంలోని అంద రూ వీఆర్ఏలు కదిలి వస్తారని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న వీఆర్ ఏలకు త్వరలో మోక్షం జరుగుతుందని,వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నెరవేరు తుందనీ  ఆశాభావం వ్యక్తం చేశారు. విఆర్ఏలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో మండల జాక్ చైర్మన్ పాలెపు శ్రీనివాస్,  ఎలిశాల రాము, రాజ్ కుమార్ , శివ, కనకయ్య, రాజయ్య ,రాజకుమార్, పోచయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.