తాతర్ర

మా అమ్మమ్మ చనిపోయిన తరువాత మా తాత మకాం మా ఇం టికే మారింది ఆయనకి ముగ్గురూ కూతుర్లే. పెద్దకూతురు మా అమ్మ. మా బాపు ఆయుర్వేద డాక్టర్‌ కానీ కొంత అల్లో పతి వైద్యం కూడా చేసేవాడు. మా ప్రాంతంలో మొట్ట మొదటిసారి సూది వాడి న డాక్టర్‌ మా బాపే. ఓసారి జగిర్దార్‌ వేములవాడ రాజన్న దర్శ నానికి వచ్చి అ స్వస్థతకి గురై గుడిపైన రూంలో పడుకున్నాడు. మా బాపు గురించి ఆయన హస్తవాసి గురించి అక్కడివాళ్లు ఆయనకు వివరించారు. మాబాపుని పిలిపించారట. ఆయన జాగిర్దారుని పరీ క్షించి రెండు పొ ట్లాలు ఇచ్చారట. వెంటనే ఆయన ఆరోగ్యం కుదు టపడింది. తెల్ల వారే వేములవాడ రాజన్న గుడి మీద మా బాపుకి డాక్టర్‌గా ఉద్యోగ  ం వచ్చింది. మా అమ్మ మా బాపుని పెళ్లి చేసు కోవడం వల్ల ఆమెకి వ్యవసాయం పనులు తెలియవు. మిగతా ఇద్ద రు చెల్లెళ్లు వ్య వ సాయదారుల్నే చేసుకున్నారు. చిన్నకూతురుని అల్లుడిని మా తాత ఇ ల్లుటం (ఇల్లరికం)తెచ్చుకున్నాడు. మా అమ్మ స్తోమత వాళ్లిద్దరికన్నా బాగా వుండటం వల్ల ఎక్కువశాతం మా తాత మా ఇంట్లోనే వుండేవాడు. ఆయన పేరు గాలయ్య.

మా ఇంటి వెనుక కాస్త ఖాళీస్థలం తరువాత గూన పెంకులతో ఓ చిన్న ఇల్లు వుండేది. అందులో రెండు అర్రలు, పెద్ద అరుగు, వంట ిల్లు వుండేది. వంటిల్లు అవతల రేకులతో ఓ పెద్ద సాయమాను వుం ేది. అందులో మా బాపు దవాఖానకోసం కషాయం తయారయ్యేది. మా గూన పెంకులతో వున్న ఇంట్లోని రెండు అర్రల్లో ఒక అర్రలో మా తాత వుండేవాడు. ఆ అర్రకి తాతర్రని పేరు. ఇప్పటీ కీ అదే పే రుతో పిలుస్తాం. మా చిన్నక్క, మా పెద్దన్న కూతురుకి, కొడుక్కు, నా కు ఆ రూంతో చాలా అనుబంధం.అప్పుడు మా తాతకి డెబ్బై అ యి  దు ఏళ్లు దాటి వుంటాయనుకుంటాను. మాకు కథలు చెప్పడం, బొ మ్మలు చేసివ్వడం, చుట్టలు చేసివ్వడమే ఆయనకున్న పని. ఆ రూం చాలా చిన్నది. చిన్నకిటకీ, ఆయనకి ఓ మంచం, ఆయన సా మాన్లు పెట్టుకోవడానికి గోడలోనే వున్న చిన్న అల్మైరా. ఎన్నో కథలు చెప్పే వాడు. తను పొలం ఎలా దున్నేది, బర్రెల నుంచి ఎలా పాలు పిండ ేది ఇవన్నీ చెప్పేవాడు. తాను విన్న కథలు, తన అనుభవంలోకి వచ్చి న కథలు చెప్పేవాడు. ఆయన చుట్ట తాగడం వల్ల ఆయన దగ్గర కంపు వాసన వచ్చేది. కానీ కథలు వినాలి. ఆయన మాటాలు వి నాలి. కథల్లో పేదరాసి పెద్దమ్మని చూడాలి. మాయల  మయాఠి మంత్రాల్లో మాయమవ్వాలి. అందుకని ఆయన కంపు వాసనని భ రించేవాడ్ని. అప్పుడప్పుడూ మమ్ములను గట్టిగా పట్టుకుని ముద్దు పె ట్టుకునేవాడు. వాసనకి తోడు ఆయన మీసాలు గరిక పోచల్లా గు చ్చుకునేవి. అన్నీ భరించేవాళ్లం. చుట్ట తాగిన తరువాత మూత కడు క్కునేవాడు. అయినా ఆ వాసన పోకపొయ్యేది. మంగలివాడు ఇం టికి వచ్చినప్పుడు ఆ మూత మీద మీసాలు తీయించమని అనే వా ళ్లం. దానికి ఆయన ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదు. ఇంకా ఎక్కు వ మాట్లాడితే మీసాల గురించి ఎన్నో కథలు చెప్పేవాడు.మాతాత చిన్న కూతురు దగ్గరకి వెళ్లినప్పుడు మాతాతర్రకి గొళ్లెం పెట్టేది మా అమ్మ. మాకు ఇంల్లతా చిన్నబోయిన ట్టుగా వుండేది. కథ లు లేక బొమ్మలు లేక కాలం కష్టంగా గడ ిచేది. చుట్టకంపు వున్నా పర్వాలేదు. ఆ మీసాలు గుచ్చుకున్నా ఫర్వాలేదు. మాతాత లేక పోవడం మాకు చాలా కష్టంగా వుండేది. ఏమీ తోచేది కాదు. మేం ఒకర్నొకరం కొట్టుకు నేవాళ్లం. మా తాత వున్నప్పుడు ఇ లాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఎం దుకంటే ఆ యన కథలతోనే మాకు కాలం సరి పొయ్యేది. ఓరోజు మ ధ్యాహ్నం మా అమ్మ ఏడుస్తూ కూ ర్చుంది. మాబాపు కూడా దవాఖానా నుంచి వచ్చాడు. కొద్ది సేపటికి తెలి సింది తాత చనిపోయాడని. చని పోవడం అంటే ఏమి టో నాకు తెలి యదు. మా పెద్ద వదిన ను అడి గాను. తాత చనిపోయి ఆకాశంలో చుక్కగా మా రిపోయినాడు అని చెప్పింది. చుక్కలన్నీ చనిపోయిన వాళ్లేనని చె ప్పింది నాకేమీ అర్థం కాలేదు.కాస్సేపటికి కచ్చురం తయారైంది. సిరిసిల్ల పోవడానికి అమ్మా బాపు తయారపుతున్నారు. నన్ను మా వదిన తోపాటు వుండమని చెప్పారు. ఉండనని చెప్పాను. కాదూ కూడదూ అన్నారు. ఏడుపులంకించుకు న్నాను. చివరికి నన్ను కచ్చురంలో కూర్చుండబెట్టుకున్నారు. మావేములవాడ నుంచి పన్నేండు కిలో మీటర్లు. ముప్పావు గంటలో సిరిసిల్లకు చేరుకున్నాం . మా అమ్మా మా చిన్నమ్మలు ఒకటే ఏడుపు. వాళ్లతో బాటు నేను ఏడ్చాను. మా తాతని కింది పడుకోబెట్టినారు. కళ్లు మూసేకుని నిద్ర పోతున్నట్టు అన్పించింది. వీళ్లందరేమో చనిపోయి నారని ఏడు స్తు న్నారు. మా వదినేమో ఆయన ఆకాశంలో చుక్కగా మారి పోయా డని చెప్పింది. నాకేమో ఆయన నిద్రపోతున్నట్టు అన్పించింది .అర గంట తరువాత మా తాతని బయటికి తీసుకుని వ చ్చారు. ఏదో కట్టెల పాడె మీద పడుకోబెట్టార. మా నాంపల్లి చిన్నా యన, ఇంకా కొంత మంది మా తాతని మోసుకుని బయటకు వచ్చారు పాడె తో బాటు. డప్పుల చప్పుడు మొదలైంది. ఏదో బాధగా ధ్వని స్తుంది. నలుగురు బంధువులు పాడెను మోస్తూ వుంటే డప్పుల చప్పు డు వెంట నడిచాను. మా అమ్మ చిన్నమ్మలని ఎవరో పట్టుకోని నడు స్తు న్నారు. నన్ను మా అమ్మ చిన్నమ్మ కొడుకు అంటే మా మామ పట్టు కున్నాడు. వాగు దగ్గరికి వచ్చాం. అక్కడ కట్టెల మీద మా తాత ని పడుకొబెట్టారు. అందరూ మనిషికొక కట్టె ఆయన మీద పేర్చారు. మా మామ నన్ను దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ నేను వినలేదు. అక్కడే వున్నాను. మా నాంపల్లి చిన్నాయిన కాస్సేపటికి ఆ కట్టెలకు నిప్పుపెట్టాడు. మా తాత కాలిపొతున్నాడు. ఎందుకట్ల పడు కున్న తాతని కాలుస్తారని మామను అడిగాను. ఆయన పడుకోలేదు, చనిపోయాడు. చనిపోయిన వాళ్లను కాలుస్తారు. నీకు అర్థంకాదులే అన్నాడు మా మామ. పెద్దగా మంటలు లేచాయి. మా బాపు నన్ను దగ్గరికి తీసుకుని చన్నీళ్లతో స్నానం చేయించాడు. ఆ తరువాత మా తాత ఇంటికి వచ్చాం. అది చిన్న ఇల్లు. నన్ను తనతో పాటు రమ్మని మా బాపు అన్నాడు. రానని చెప్పాను. నిద్రలోకి జారుకున్న తరు వాత నన్ను తీసుకొని వేములవాడకి వచ్చాడు. లేచి చూసు కునేసరికి వే ములవాడలో వున్నాను.

ఓ పదిరోజుల తరువాత మా అమ్మ మా ఇంటికి వచ్చేసింది. ఎవరి తో మట్లాడకుండా కొంతకాలం మౌనంగా వుంది మా అమ్మ. ఆ త రువాత మామూలు ప్రపంచంలోకి వచ్చేసింది. మా తాతర్ర అలాగే వుంది. అంతకు ముందు మాతాత మళ్లీ వస్తాడన్న అశతో వేచి చూ స్తూ వుండేది. కాని ఆ అర్రకి తాత విషయం తెలిసిందో లేదో కానీ అది అంతకుముందు ఎదిరి చూస్తున్నట్లుగా నాకన్పించేది. లోపలికి వెళ్లి నాకు తెలిసిన విషయాలు మా తాతర్రకు చెప్పాలని అన్పించేది. కానీ దానికి ఎప్పుడూ గొళ్లెం పెట్టి వుండేది. గొళ్లెం పైకి వుండేది. నాకు అందకపొయ్యేది. మా అమ్మని తియ్యమని చెబితె వినలేదు. కో పంగా నావైపు చూసేది. అడగడం మానేశాను. ఎండాకాలం బంగ్ల మీద డాబాలో పడుకున్నప్పుడు ఆకాశంకేసి చూసేవాడ్ని. ఎన్నోవేల చుక్కలు. అందులో ఎక్కడని వెతికేది మా తాతాని. మాకు జ్వరం వచ్చినప్పుడు, దిష్టితాకినప్పుడు మా తాత మాకు మంత్రం వేసే వాడు . మా తాతకి మంత్రాలు వచ్చు గదా. ఎప్పుడన్నా వచ్చి నాతో మాట్లాడతాడని చాలా రోజులు ఎదురుచూశాను. కాని మాతాత రాలేదు. ఆయనకు వచ్చిన మంత్రాలు ఏమైనాయో నాకర్థం కాలే దు.రెండు మూడు నెలలు తరువాత అప్పుడప్పుడు మా తాతర్ర తలు పులు తెరుచుకోవడం మొదలైంది. అందులో వున్న నులక మంచం బయటకు వచ్చేసింది.తాతర్రలో ఓ బెంచి వేశారు.దానిమీద ఇంట్లో అవసరం లేని సామాన్లు పెట్టడం మొదలుపెట్టారు. చివరికి అది సామాన్లు పెట్టుకునే అర్రగా మారింది. కానీ దానిపేరు మార లేదు. అదే పేరు తాతర్ర. మాతాత తరువాత ఆ అర్రని ఎప్పుడూ ఎ వరూ ఉపయోగించలేదు. ఆ అవసరమూ రాలేదు. ఇంట్లో వున్న అర్రలే ఖాళీగా వుంటున్నాయి.జీవన పరిధి పెరిగిన కాలంలో తాతలు పెరు గుతున్నారు. తాతర్రలు లేకుండా పోతున్నాయి. ప్రతి ఊరి చివ ర , నగరం అంచుల్లో వస్తున్న వృద్ధాశ్రమాలే వాళ్ళ అర్రలుగా మారి పోతున్నాయి. ఈ వృద్ధాశ్రమాలని చూసినప్పుడల్లా మా తాతే గుర్తు కొస్తాడు. అప్పటికీ ఇప్పటికీ ఎన్ని మార్పులు. అప్పుడు మా తాతా నేనూ ఎన్నో కథలు. ఇప్పుడు పిల్లలూ కంప్యూటర్లు వృద్ధా శ్రమా లు.ఎప్పుడన్నా మా ఇంటికి వెళ్లినప్పుడు మా తాతర్ర ముందు కూర్చుని గాలి పీలుస్తాను. బహుశా ఆగాలే కథలు రాయిస్తుందేమో.