తాలిబన్ల భయంతో విద్యార్థినుల రికార్డులు కాల్చివేత


బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు ట్వాట్‌
కాబుల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అఫ్ఘాన్‌లో తాలిబన్లకు భయపడి ఉన్న ఒకే ఒక బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు తన విద్యార్థినుల రికార్డులను తగులబెడుతున్నట్లెఉ ప్రకటించారు. వారి భవిష్యత్తు చెరిపేసేందుకు కాదు.. వారిని, వారి కుటుంబాలను కాపాడేందుకు మాత్రమే అంటూ అప్గానిస్థాన్‌లోని బాలికల పాఠశాల ’స్కూల్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌’ వ్యవస్థాపకురాలు షబనా బాసిజ్‌ రసిఖ్‌ తెలిపారు.జ తమ వద్ద చదువుతున్న బాలికలందరి రికార్డులను అగ్నికి ఆహుతి చేశారు. కాబుల్‌ను మళ్లీ హస్తగతం చేసుకున్న తాలిబన్ల నుంచి, షరియా చట్టాల పేరిట వారు అమలుచేసే కఠినమైన శిక్షల నుంచి బాలికలను కాపాడేందుకే తాను ఇలా చేసినట్టు ఆమె ట్వీట్‌ చేశారు. బాలికల దస్తావేజులను తగులబెడుతున్న దృశ్యాలను కూడా షబనా ఆ ట్వీట్‌కు జత చేశారు. 20 ఏళ్ల కిందట తాలిబన్లు మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు.. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. ప్రశ్నించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డారు. ’విద్యార్థినుల దస్తావేజులన్నీ కాల్చేశారు. తాలిబన్ల పాలన అంతరించాక 2002 నుంచి అఎª`గాన్‌లో మళ్లీ బాలికలకు కొత్త అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి’ అంటూ నాటి భయానక పరిస్థితులను ఆమె తలచుకొన్నారు. ’ఇపుడు మళ్లీ తాలిబన్లు వచ్చి మహిళల గొంతు నొక్కేలా షరియా చట్టం అంటున్నారు. మేం భద్రంగా ఉన్నాం. దేశంలో మిగతా మహిళల పరిస్థితులు మాలాగా లేవని అన్నారు. ఈ భూమిపై పుట్టిన బాలికలు దృఢంగా మారాలంటే చదువు తప్ప మరో మార్గం లేదు. వీరి చదువు కోసం పోరాడాలన్న తపన నాలో తగ్గలేదు. కానీ, అఎª`గాన్‌ సమాజం ఇపుడు అభద్రతాభావంతో వణుకుతోంది. వారిని చూస్తే మనసు ముక్కలవుతోంది’ అని షబనా ట్వీట్‌ చేశారు.