తాలూకా మొదటి ర్యాంకు దోమ పాఠశాలకే…. సర్పంచ్ కె రాజిరెడ్డి
పదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి దోమ పాఠశాలకు గుర్తింపు తేవడం హర్షించ దగ్గ విషయం అని దోమ మండల సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి అన్నారు. దోమ జిల్లాపరిషత్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన బెజ్జంకి శ్వేత పది లో 9.8. గ్రేడ్ సాధించి తాలూకా టాపర్ గా నిలవడంతో శుక్రవారం పాఠశాల లో విద్యార్థినికి స్వీట్లు తినిపించే కార్యక్రమం లో సర్పంచ్ రాజిరెడ్డి పాల్గొని అభినందనలు తెలిపారు మధు 9.7. విష్ణవి 9.3. మార్కులు సాధించిన వారికీ స్వీట్లు తినిపిచ్చారు మళ్ళీ వచ్చే సమావత్సరం కూడా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలనీ డైరెక్టర్ యాదయ్య గౌడ్ అన్నారు ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు పురందాస్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తాలూకా మొదటి ర్యాంకు సాధించిన శ్వేత కు స్వీట్లు తినిపిస్తున్న సర్పంచ్