బీజేపీ మోర్చా జిల్లా కార్యదర్శిగా ఎక్కాల దేవి జమున చంద్రం యాదవ్ నియామకం

గంభీరావుపేట ఆగస్టు 01 జనం సాక్షి; బీజేపీ మోర్చా జిల్లా కార్యదర్శిగా గంభీరావుపేట మండలానికి చెందిన ఎక్కాల దేవి జమునచంద్రం యాదవ్ ను నియమించిన , జిల్లా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ మరియు జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి ఎక్కాల దేవి యమునా చంద్రం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మూర్చ అధ్యక్షురాలు అన్నపూర్ణ, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.



