నూతన పెన్షన్ విధానంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉద్యోగులు

*లైన్మెన్ లింగయ్య ఉద్యోగ విరమణ సభలో ఏఈ పి.శంకర్

స్టేషన్ ఘనపూర్ శుక్రవారం ఉద్యోగ విరమణ చెందిన తాటికొండ 33/11కేవి సబ్ స్టేషన్ లైన్మెన్ కొన్నె లింగయ్య అభినందన సన్మాణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఈ ఆపరేషన్ ఘనపూర్ టౌన్ పగిడిముంతల శంకర్ నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగ విరమణ అనంతరం ఈపిఎఫ్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలోని సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం ఎస్సీ,ఎస్టీ సంఘ్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సంకె రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన లింగయ్య ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినంద సన్మాణ కార్యక్రమంలో ఏఈ శంకర్ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు లైన్మెన్ లింగయ్య అని,ఆడంభరాలకు ఆమడ దూరంలో ఉంటూ విధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడని అతని సేవలను కొనియాడారు,గత 24సంవత్సరాల క్రితం సౌంస్థలో విలేజ్ ఎలక్ట్రీకల్ వర్కర్గా మొదలైన లింగయ్య ఉద్యోగ ప్రయాణం నేడు లైన్మెన్గా విరమణ చెంది తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడన్నారు,ప్రతీ ఉద్యోగి నిష్పక్షపాతంగా సేవలు అందించినపుడే సౌంస్థ స్థిరంగా ఉంటుందని,సౌంస్థ బలంగా ఉంటేనే ఉద్యోగులకు సంరక్షణ ఉంటుందని ఈ సందర్బంగా ఏఈ సూచించారు
విద్యుత్ శాఖలో 1999నుండి అమలవుతున్న నూతన పెన్షన్ ఈపిఎఫ్ విధానం ఉద్యోగులకు శాపంగా మారిందని విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా లేకపోవడం పట్ల వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని,30ఏళ్లకు పైగా సౌంస్థలో హుందాగా గడిపిన వారు,ఉద్యోగవిరమణ అనంతరం ఆర్థికంగా,ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురుకోవడం బాధాకరమని,తిరిగి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి లింగయ్య లాంటి ఎంతోమంది ఈపిఎఫ్ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరారు
అనంతరం సహచర ఉద్యోగులు మరియు లింగయ్య బంధుమిత్రల సమక్షంలో లింగయ్య దంపతులను ఘణంగా సన్మాణించి సౌంస్థ తరపున ప్రత్యేక జ్ఞాపికను ఏఈ అందజేశారు,ఈకార్యక్రమంలో ఐఎన్టియుసీ 327యూనియన్ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు వడ్డేపల్లి యాదగిరి,బోసాని రాజ్ కుమార్,సీనియర్ వర్కింగ్ ప్రసిడెంట్ ఎండి.ఫయాజ్,వర్కింగ్ ప్రసిడెంట్ వాసం శ్రీధర్,డి.సాంభరాజు,సీనియర్ నాయకులు ఎల్.రామాచారి,కుమార స్వామి,కృష్ణంరాజు,సురేందర్ రెడ్డి,అన్వర్ పాషా,యుగేందర్,రమేష్,అశోక్,కుమార్,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు