తూటాలకు ఎదురొడ్డి నిలిచిన సాహసి


టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150 వ జయంతి
విజయవాడ,ఆగస్ట్‌23 (జనంసాక్షి): టంగులూరి ప్రకాశం పంతులు గుండెల విూద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడిరది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ ప్రయత్నమే చేసింది. అయినా నమ్మినదే చేశారాయన. కుమిలిపోలేదు. విశ్వసించినదానినే గౌరవించారు. వైరాగ్యాన్ని దరి చేరనీయలేదు. తుది పైసా కూడా జాతి స్వేచ్ఛ కోసం అర్పించారు. తన కడుపులో పేగులు ఆకలితో గాండ్రిస్తున్నా వినిపించుకోకుండా, ప్రజల క్షుద్బాధనే పట్టించుకున్నారాయన. అందుకు, ఆయన ’ఆంధ్రకేసరి’. కానీ, ఆయన అణువణువూ సింహమే, అన్నారు రాజాజీ. ఆయన ఏం చేసినా ఆంధ్రుల అభ్యుదయం కోసమే అన్నారు జవహర్‌లాల్‌. నిజమే, చరిత్రలో ఎక్కడో గాని తారసపడని ఓ కచ్చితమైన ప్రజల మనిషి. ఆయనే మన టంగుటూరి ప్రకాశంపంతులు. ఆంధ్రకేసరి జీవిత చరిత్ర విూద సింహావలోకనం చేసినా రోమాంచితం చేసే ఘట్టాలు అడుగడుగునా కనిపిస్తాయి. ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872వ సంవత్సకలో జన్మించారు. చరిత్ర అంటే భారత స్వాతంత్యోద్యమ్ర చరిత్రే అనకపోవచ్చు. టంగుటూరి ఉద్యమం అంటే ఆంధ్రుల ఉద్యమ చరిత్ర అని కూడా అనకపోవచ్చు. కానీ ప్రకాశం అంటే… దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టు ’మూడుకోట్ల జనం పేరు’. అంటే నాటి ముక్కోటి ఆంధ్రుల హృదయ స్పందన. 1927లో సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు జరిగిన ఘట్టం ప్రకాశం అంటే ఏమిటో భారతదేశానికి తెలిసే అవకాశం ఇచ్చింది.. సైమన్‌ కవిూషన్‌ మద్రాసుకు వచ్చింది. మద్రాసులో అతనిని బహిష్కరించటం వద్దన్నాడు గాంధీజీ. గాంధీగారి ఆదేశం ప్రకాశంగారికి నచ్చలేదు. రాజాజీ చల్లగా తప్పుకున్నాడు. ప్రకాశంపంతులు, దుర్గాబాయ్‌, రంగయ్యనాయుడు గార్లు, వేలాది ప్రజలతో వూరేగింపువెళ్తూ ’సైమన్‌ గోబ్యాక్‌’ అని గర్జించారు. బ్రిటీష్‌ తొత్తులైన సైనికులు తుపాకులతో కాలుస్తాం అని కేకలు వేశారు. ఒక అజ్ఞాత దేశభక్తుడు తుపాకి గుళ్లకు బలిఅయ్యాడను వార్త దావానలంలా వ్యాపించింది. ప్రకాశం సింహంలా ముందుకురికాడు. చొక్కా గుండీలు విప్పి’రండిరా ఇదె కాల్చుకొండిరా’అని గుండెలిచ్చి గండడైనిల్చాడు. తుపాకులు తలలువంచాయి. అంతటితో ప్రకాశం పేరు దేశమంతటా మార్మోగింది. ’ప్రమాదములున్న చోటనే ప్రకాశంగారుంటారు’అన్న పట్టాభిగారి మాటలు సత్యపూర్ణమైనవి. లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ప్రకాశం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.అంతకు ముందే సెంట్రల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కి ఎన్నికయ్యారు. ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యారు. మద్రాస్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ మత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్టాన్రికి తొలి ముఖ్యమంత్రి ఆయనే. కానీ అప్పటికే ఆయన తాను ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్యంª`ర నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న రీతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిదా్యన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చినిగిన దుస్తుల్లో, చిల్లులు పడ్డ శాలువతో, తిండిలేక డస్సిపోయిన ముఖంతో విజయవాడ వీధులలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఆ దృశ్యాలను ఎప్పటికి మరచిపోలేకపోయారు.తల్లి సుబ్బమ్మగారు అంతిమక్షణాలలో కొడుకును పిలిచింది. ఒక చిన్న మూటను
అప్పగించింది. ఎనిమిది వందల రూపాయలున్నాయి అందులో. ఆమె కష్టార్జితం. ’తన అంత్యక్రియలకి’ అని చెప్పారావిడ. కన్నతల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా నాకు మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారాయన. అయినా,దేశమాత రుణాన్ని ప్రకాశం గారు తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం.