స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయండి

` ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
హైదరాబాద్‌్‌(జనంసాక్షి):జూనియర్‌ కళాశాలు, డిగ్రీ కళాశాలలు మరియు పాలిటెక్నిక్‌ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌ లో ఉన్న స్కాలర్షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజాభవన్‌ లో ఆర్థిక శాఖ తో పాటు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని జూనియర్‌, డిగ్రీ మరియు పాలిటెక్నిక్‌ కళాశాలలు 2,813 సంబంధించిన 161 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా అధికారుల సమీక్షలో నిర్ధారించారు. మొత్తం 161 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.