సెస్” లో ఏం జరుగుతోంది..?

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 19. (జనంసాక్షి).

రెండు రోజులు వరసగా విజిలెన్స్ దాడులు.

జిల్లాలో కలకలం రేపుతున్న విజిలెన్స్ దాడుల వ్యవహారం.

“ది సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ”(సెస్) కు దేశంలోనే ప్రగతి పథంలో నడుస్తున్న సహకార సంస్థగా పేరు ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతాంగానికి, ప్రతిష్టాత్మకమైన సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు విద్యుత్ సేవలను అందిస్తూ జిల్లాలో ఆయా రంగాల అభివృద్ధికి విద్యుత్ సేవలు అందిస్తున్న సంస్థగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇటీవల చర్చ నీ అంశంగా మారుతున్న “సెస్ “పరిణామాలు అంశాలపై జనంసాక్షి. ప్రత్యేకం.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార రంగంలో సేవలను అందిస్తున్న” సెస్ “సంస్థ గురించి అందరికీ తెలిసిందె. రెండు రోజులుగా సెస్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల సెస్ చైర్మన్ పై అనేక కథనాలు చర్చ నీ అంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సెస్ చైర్మన్ మీడియా ముఖంగా అలాంటిదేమీ జరగలేదంటూ ప్రకటించారు. అయితే గడిచిన రెండు రోజులుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సెస్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించడం జిల్లాలో చర్చని అంశంగా మారింది. ఇప్పటివరకు అధికారులు ఇలాంటి సమాచారాన్ని ప్రకటించకపోవడంతో విద్యుత్ వినియోగదారులను సందేహాలు వెంటాడుతున్నాయి. ఆకస్మిక తనిఖీల వెనుక ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు జిల్లాలో చర్చ నీ అంశంగా మారింది. అసలు సెస్ లో ఏం జరుగుతుందో హాట్ టాపిక్ మారింది.