ఢల్లీి ఎర్రకోట పేలుళ్ల ఘటన..

మరో నలుగురిని అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ
న్యూఢల్లీి(జనంసాక్షి): ఢల్లీి ఎర్రకోట సవిూపంలో జరిగిన పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను ఎన్‌ఐఎ పట్టుకుంది. గురువారం శ్రీనగర్‌లో వీరిని అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ దాడితో సంబంధం ఉన్న మొత్తం అరెస్టులు 6కి పెరిగాయి. నవంబర్‌ 10న ఢల్లీిలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోన్న సంగతి తెలిసిందే. జిల్లా సెషన్స్‌ జడ్జి, పాటియాలా హౌస్‌ కోర్టు జారీ చేసిన ఆర్డర్ల మేరకు నలుగురు నిందితులను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్‌ ముజమ్మిల్‌ షకీల్‌ గనై, జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన డాక్టర్‌ అదీల్‌ అహ్మద్‌ రాథర్‌, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన డాక్టర్‌ షాహీన్‌ సయీద్‌ ఇంకా, జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన ముఫ్తీ ఇర్ఫాన్‌ అహ్మద్‌ వాగేగా గుర్తించారు. వీరందరూ ఢల్లీి బ్లాస్ట్‌ లో ముఖ్యమైన పాత్ర పోషించారని దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది. టీవల ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పేలుడుకు ఉపయోగించిన కారు ఎవరి పేరున రిజిస్టర్‌ అయిందో అతనైన(అవిూర్‌ రషీద్‌ అలీ)ని, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదికి సాంకేతిక సహాయం అందించిన డానిష్‌ అలియాస్‌ జాసిర్‌ బిలాల్‌ వాని లను ఔఎం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో పూర్తి కుట్రను వెలికితీసే ప్రయత్నాలలో భాగంగా వీరిద్దరినీ ఇంటరాగేట్‌ చేస్తోంది.కాగా, ఈ పేలుడు ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై దర్యాప్తును ఎన్‌ఐఏ కి అప్పగించింది. దాడికి కారణమైన గ్రూపులోని ప్రతి సభ్యుడిని గుర్తించి అరెస్టు చేయడానికి ఏజెన్సీ వివిధ రాష్ట్ర పోలీసు దళాలతో కలిసి పనిచేస్తోంది. నవంబర్‌ 10న ఢల్లీిలోని నేతాజీ సుభాష్‌ మార్గ్‌లో ముష్కరమూకలు జరిపిన పేలుడులో 15 మంది మరణించారు.