అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు

నవంబర్ 20 (జనంసాక్షి)హైదరాబాద్: సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి బంధువులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ నెల 17న సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 42 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అడిక్‌మెట్, రాంనగర్, విద్యానగర్‌లోని మృతుల కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.
అనంతరం మాట్లాడుతూ.. సౌదీ బస్సు ప్రమాదంలో 42 మంది తెలంగాణ వాసులు చనిపోయారు. ఒకే కుటుంబంలో 18 మంది మరణించడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులు సౌదీ అరేబియా వెళ్లారు. వారికి బాసటగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ బృందం కూడా సౌదీ అరేబియా వెళ్లింది. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. మృతుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.



