కల్లుగీత పోరు కేక బహిరంగ సభకు గౌన్నలు తరలిరావాలి..

మంగపేట నవంబర్ 20 (జనంసాక్షి)
చలో సూర్యాపేట బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ
ఇంటికో గౌడు… ఊరికో వాహనం తో కదం తొక్కాలి…
కల్లుగీత కార్మికుల సమస్యపై ఈనెల 28 న సూర్యాపేటలో జరిగే కల్లుగీత రణభేరి బహిరంగ సభకు తరలిరావాలని ఆ సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలో ‘చలో సూర్యాపేట బహిరంగ సభ’ పోస్టర్ , కరపత్రాలను ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై న్యాయమైన హక్కుల కొరకు ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలపై గీత కార్మికులందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ ఈనెల 28 న జరిగే చలో సూర్యాపేట బహిరంగ సభ కు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు. అలాగే ఇంటికో గౌడు… ఊరికో వాహనంతో పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నక్క యాకయ్య గౌడ్, రావుల శ్రీనివాస్ గౌడ్, లోడే శ్రీనివాస్ గౌడ్ , మండల కమిటీ సభ్యులు చామకూరి కృష్ణ గౌడ్, లోడే కృష్ణ గౌడ్, మానుపెల్లి దేవేందర్ గౌడ్, గుండగాని వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



