తెగిపడ్డ విద్యుత్‌వైర్లు ,పలురైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
వరంగల్ : రైల్వే ట్రాక్‌లపై విద్యుత్ వైర్లు తెగిపడడంతో పలు రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా తాళ్ల పూసపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. దాంతో డోర్నకల్ స్టేషన్‌లో ఇంటర్ సిటీ, నవజీవన్ రైళ్లను నిలిపివేశారు.