తెరాసలో ఉద్యమకారులకు విలువలేదు

– సీఎం కేసీఆర్ రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు
– డబ్బుతో  కెసిఆర్ ను కలిస్తేనే పార్టీలో విలువ
 మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.
 నల్గొండ బ్యూరో, జనం సాక్షి .
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తోడ్పాటు అందించిన ఉద్యమకారులకు ప్రస్తుత పార్టీలో గుర్తింపు లేదని బిజెపి మునుగోడు ఉప ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్  వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బుధవారం మునుగోడు లోని  బిజెపి ఉప ఎన్నికల కార్యాలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన  కుటుంబాలను, ఉద్యమంలో తోడ్పాటు అందించిన  ఉద్యమకారులను సీఎం కేసీఆర్  అణగదొక్కారని అన్నారు.  ప్రస్తుతం పార్టీలో డబ్బులు ఎవరు ఎక్కువగా  పట్టుకొస్తే  వారికి విలువ ఇస్తున్నారని అన్నారు. రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్న ఘనత కెసిఆర్ దని  విమర్శించారు. మిషన్ భగీరథ పేరుతో  వేలాది కోట్లను దండుకున్న కేసీఆర్ పాత వాటర్ ట్యాంకులకే రంగులు వేసి తామే నిర్మించామని  చెప్పుకుంటున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గం  లో మహిళలకు పావులా వడ్డీ రుణాలు లేవని,కేవలం రాజగోపాల్ రెడ్డి రాజీనామా తోనే నిద్రలేచిన కేసీఆర్  ఓట్ల కోసం కొత్త పథకాలను మునుగోడు నియోజవర్గ కేంద్రం నుండి  ప్రవేశపెట్టారని  ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అని  ఎద్దేవా చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో  ఓట్ల సమయంలో 10000 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించిన  సీఎం కేసీఆర్ నేటి వరకు  రూపాయి కూడా కేటాయించలేదని, మునుగోడు లో కూడా  అది పరిస్థితి ఏర్పడుతుందని హోటల్లో ఈ విషయాన్ని గమనించాలని వివేక్ వెంకటస్వామి కోరారు. దుబ్బాక, హుజురాబాద్  ఎన్నికల్లో  ఓటమి చవి చూసిన అనంతరం ఆ వైపే చూడడం లేదని  అన్నారు. చర్లగూడెం డిండి భూ నిర్వాసితులు  ఇప్పటికి ఆందోళన చేస్తున్నారని, వారిని ఏమాత్రం పట్టించుకోని సీఎం కేసీఆర్ ఎన్నికల కారణంగా మునుగోడులో  అల్లరి కానీ వాగ్దానాలు చేస్తూ  ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు  కేటాయించడంలో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని, రాష్ట్రంలో ప్రకటించిన నిరుద్యోగ భృతి అమలు కాకపోవడంతో యువత ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అభిషేక్ రావు కవితకు బినామీ అని  వివేక్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవినీతిలో,  లిక్కర్ విక్రయాలలో  దేశంలో నెంబర్ వన్ గా ఉన్నారని, మునుగోడు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ కూడా ఆభద్రతాభావంతో  బిజెపి నేతలను విమర్శిస్తున్నారని, తన సోదరీ కవితను లికర్స్ స్కాం లో ఉన్నందున ఇబ్బంది పడుతున్నారని అన్నారు.  ధరణి పోర్టల్ పేరిట జరిగిన పెద్ద అవినీతిపై సిబిఐ దర్యాప్తు కు ఆదేశించాలని  డిమాండ్ చేశారు