తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో
దంతాలపల్లి: తెలంగాణ అంశంపై ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఆధ్వర్యంలో మండలంలోని దంతాలపల్లిలో రాస్తారోకో చేశారు. సీమాంధ్ర నేతలకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ ఖాజామియాతో పాటు తెరాస నేతలు పాల్గొన్నారు.