తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావు
హైదరాబాద్ : కేసీఆర్‌పై ఈగ వాలకుండా చూడటమే తాను చేసిన ద్రోహమా? అంటూ తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడ అనలేదని ఆయన బషీర్‌బాగ్ ప్రెన్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 13 ఏళ్లుగా తెలంగాణ కోసం పార్టీలో పనిచేస్తున్న తనకు ఇచ్చిన బహుమానం ఇదేనా? అని మండిపడ్డారు. తాను ఏ కంపెనీ వద్ద డబ్బు తీసుకోలేదని తిరుమల వెంకన్న మీద ప్రమాదం చేసి చెబుతున్నానని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు 48 గంటల్లో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఆరోపణలకు రుజువులు చూపకపోతే తెరాస భవన్‌కు వస్తా.. ఎవరేం చేస్తారో చూస్తా అని సవాలు విసిరారు. ఎవరెవరిని బెదిరించి పార్టీ నేతలు ఎన్ని చెక్కులు తెచ్చారో తన వద్ద జిరాక్స్‌లు ఉన్నాయని వెల్లడించారు.