తెలంగాణకు ఒక్కరూపాయీ ఇవ్వను
ఏం చేస్తారో చేసుకోండి :సీఎం
హైదరాబాద్, మార్చి 15 (జనంసాక్షి) : స్రీమాంధ్ర పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్‌రావు పేర్కొనడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటారో చేసుకోండి, రాసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే హరీశ్‌రావుపై
మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అంటూ ఊగిపోయారు. తెలంగాణ కోసం మాట్లాడుతున్న హరీశ్‌రావును సీఎం వీధి రౌడీతో పోల్చారు. తెలంగాణను అవమానించే విధంగా మాట్లాడడంపై టీఆర్‌ఎస్ మండిపడింది. కిరణ్‌కుమార్ తెలంగాణ వ్యతిరేకి అని పేర్కొన్నారు.