తెలంగాణకు కొత్త సచివాలయం

C

-ఎర్రగడ్డ చాతీ ఆసుపత్రి స్థలంలో నూతన భవన సముదాయం

-ఫాస్ట్‌ పథకం రద్దు, పాత పథకమే అమలు

-తెలంగాణ మొక్కులు తీర్చుకొంటాం

-రైతు బజారులు ఆదునీకీకరణ,

– వరంగల్‌కు గ్రేటర్‌ హోదా

– కేబికెట్‌ కీలక నిర్ణయాలు

-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ విూటింగ్‌లో నిర్ణయం తీసుకు న్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రి స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంతోపాటు అదే ప్రాంగణంలో హెచ్‌వోడీలను కూడా సచివాలయం పరిధిలోనే నిర్మిస్తామని తెలిపారు. సచివాలయ నిర్మా ణంను ఏడాదిలోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇందు కోసం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. సచివాలయం కట్టకున్నా సరే కానీ ఆస్పత్రిని మాత్రం తరలించాలని సీఎం అన్నారు. ఆస్పత్రి కట్టిననాడు ఎర్రగడ్డ ఒక కుగ్రామమని అక్కడ ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు. అందుకే ప్రశాంతంగా ఉండే వికారాబాద్‌కు తరలించాలని నిర్ణయిం చామన్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఏడు గంటలకుపైగా కేబినెట్‌ సమావేశం జరిగింది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది.

కేబినెట్‌ నిర్ణయాలు:

– ఫాస్ట్‌ పథకం ఉండదు

– ఫాస్ట్‌ పథకం స్థానంలో పాత రీయింబర్స్‌మెంట్‌ విధానం కొనసాగింపు

– గత ప్రభుత్వాలు వదిలేసిన రూ.862 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించాలి

– పాత బకాయిలు విడతల వారీగా విడుదల చేయాలి

– కొత్తగా వచ్చే ప్రతీ జీవోలో 371(డి) నిబంధనను పాటించాలి

– జీవో నెంబర్‌ 58 కింద 125 గజాల స్థలాలకు ఉచిత క్రమబద్దీకరణ

– భూ క్రమబద్దీకరణ జీవోలో స్వల్ప మార్పులు

– మార్చి 10లోగా క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి

– వరంగల్‌కు గ్రేటర్‌ ¬దా, పోలీస్‌ కమిషనరేట్‌కు ఆమోదం

– సాంస్కృతిక వారధి కింద కళాకారులకు 550 ఉద్యోగాలు

– రూ.100 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంసం మార్కెట్ల నిర్మాణం

– సిటీలో కూరగాయల మార్కెట్ల ఆధునీకరణ

– చెస్ట్‌ ఆస్పత్రి స్థలంలో కొత్త సెక్రెటేరియట్‌ నిర్మాణం, హెచ్‌వోడీల నిర్మాణం

– తెలంగాణ వచ్చింది కాబట్టి దేవుళ్లకు మొక్కులు చెల్లించాలి

– తిరుమల శ్రీవారికి రూ.5 కోట్లతో అభరణాలు చేయించాలి

– వరంగల్‌ భద్రకాళీ అమ్మవారికి స్వర్ణ కిరీటం

– బెజవాడ కనకదుర్గ అమ్మవారికి, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు సమర్పించడం

– తెలంగాణ నుంచి వెళ్లే అజ్మీర్‌ యాత్రికుల కోసం రూ.5 కోట్లతో వసతి గృహం నిర్మాణం

తెలంగాణ వచ్చింది మొక్కులు తీర్చుకుంటాం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని బండలేదు అని సీఎం  అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కనుక తాము మొక్కిన మొక్కులను తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ

కేబినెట్‌ భేటీ అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. దేవుళ్ల మొక్కులు చెల్లించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మొక్కులన్నింటిని అధికారంగా సమర్పిస్తామని స్పష్టం చేశారు. తిరమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లతో అభరణాలు చేయిస్తామని మొక్కుకున్నామని తెలిపారు. ప్రభుత్వాధికారి రమణాచారి ఆధ్వర్యంలో వీటిని తయారు చేయాలని నిర్ణయించామని అన్నారు. అజ్మీర్‌ యాత్రకు వెళ్లే వారికి రూ.5 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామని వెల్లడించారు. అజ్మీర్‌ దర్గాకు వెళ్లి తానే స్వయంగా బాబాకు పూలఛాదర్‌ సమర్పిస్తానని కేసీఆర్‌ తెలిపారు. వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయిస్తామని అన్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలను సమర్పించుకుంటామని పేర్కొన్నారు

125 గజాల భూమికి ఉచిత క్రమబద్దీకరణ

ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్నవారికి ఆ భూమిని ఉచిత క్రమబద్దీకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 125 గజాల స్థలాల్లో ఉన్న ఇళ్లకు ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు తాము జారీ చేసిన జీవో నెంబర్‌ 58 కింద లక్షా 77 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని తెలిపారు. అయితే 125 గజాల కన్న ఎక్కువగా భూమి ఉంటే ఆ భూమికి కొంత మొత్తాన్ని వసూలు చేసి క్రమబద్దీకరణ చేస్తామని పేర్కొన్నారు.