తెలంగాణను ప్రకటించే శక్తి కేసీఆర్‌కు ఎక్కడిది
13నుంచి సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపాలిటీళ్లో పాదయాత్రలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
హుస్నాబాద్ జూలై 11(జనంసాక్షి)
రెండు నెలల్లో తెలంగాణ వస్తుందని ప్రకటించే శక్తి కేసీఆర్‌కు లేదని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. లోక్ సత్తా జిల్లా ఉపాధ్యక్షుడు పందిల్ల శంకర్ పితృవియోగం చెంఓదగా బుధవారం ఆయన కు టుంబ సభ్యులను పరామ ర్శించారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రెం డు నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్పిన కేసీఆర ్‌కు కల వచ్చింద కాం గ్రెస్ అధిష్టానం చెప్పిందా అనే విషయాన్ని స్పష్టం చేయాల న్నారు. తెలంగా ణ వస్తుందని ఇప్పుడు ఉద్యమాలు ఎందుకని చెప్పిన కేసీఆర్ సోనియా గాంధీతో తెలంగాణను ప్రక టింప చేయాలని డిమాండ్ చేశారు. తెలం గా ణ ఉద్యమంలో జేఏసీ ముఖ్యంగా ఉద్యోగ సంఘ నాయకులు చురుగ్గా పాల్గొంటు న్నారన్నా రు. తెలంగాణ అంశం కేసీఆర్‌తోపాటు అన్ని పార్టీలు ప్రజా, ఉద్యోగ సంఘాల కృషి వల్లే కేంద్రం వరకు వెళ్లిందన్నారు. తెలంగాణ రాష్ట్రం లాబీయింగ్ మాటలతో రాదని పోరాటాల ద్వారా నే వస్తుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పై సీపీఐ ఆధ్వర్యంలో ఈనె ల 15 నుంచి 21వరకు పాదయాత్రలు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. డివిజన్ వారీగా ఇంటి స్థలా లు, రేషన్ కార్డులు, తాగునీరు తదితర సమస్యల పై ప్రజలను చైతన్య వంతులను చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యల పై రాష్ట్ర వ్యాప్తం గా ఈనెల 27న తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు. ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య భూహద్దుల వివాదం సమస్యను పరిష్కరించలేని అది కారులు ఆరవ విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ఎలా చేపడుతారని ఆయన ప్రశ్నించారు. 60ఏళ్ల నాటి సర్వే ప్రకా రం నిర్వహించిన హద్దులతో పట్టాలు తీసుకున్న పేదలు ఇబ్బందులు పడు తున్నారన్నారు. రెవె న్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతుందని అవినీతికి పాల్పడే ఆర్‌వోఆర్ పై చర్యలు తీసు కోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పెండెల అయిలయ్య,పట్టణ కార్యదర్శి అయిలేని మల్లిఖార్జున్‌రెడ్డి, గడిపె బాలయ్య పాల్గొన్నారు.