తెలంగాణపై కాంగ్రెస్‌ నోరు విప్పాలి

కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో కాంగ్రెస్‌ పార్టీయే నోరు విప్పాలని రాష్టీయ్ర లోక్‌దళ్‌ నేత, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో అనేకసార్లు తెలంగాణ అంశం లేవనెత్తామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని యూపీఏ సమన్వయ కమిటీ సమావేశంలోనూ కోరానన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆర్‌ఎల్డీ పోరాటం చేస్తుందని చెప్పారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. దాదాపు నాలుగు నెలల విరామం అనంతరం డ్రీమ్‌లైనర్లు ఆకాశయానం చేయనున్నాయి. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ బోయింగ్‌ 787 దేశీయ విమాన సర్వీసులను బుధవారం నుంచి నడపనుంది. నాలుగు నెలల విరామం అనంతరం డ్రీమ్‌లైనర్‌ సేవలను బుధవారం అందుబాటులోకి తేనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ మంగళవారం ప్రకటించారు. ఈ నెల 22 నుంచి ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ విదేశీ విమాన సర్వీసులు నిర్వహిస్తామని తెలిపారు. ఎయిరిండియా వద్ద ఉన్న ఆరు బోయింగ్‌ 787 విమానాలు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డిసెంబర్‌కల్లా మరో ఎనిమిది డ్రీమ్‌లైనర్లు ఎయిరిండియాలో చేరతాయని తెలిపారు. ప్రభుత్వ విమానయాన సంస్థ మొత్తం 27 బోయింగ్‌ 787 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇప్పటికే ఆరు చేరుకోగా, డిసెంబర్‌లో మరో 8 రానున్నాయి. డ్రీమ్‌లైనర్లలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా ప్రయాణికుల భద్రతా కారణాల రీత్యా ఎయిరిండియా నాలుగు నెలల క్రితం వాటిని నిలిపివేసింది. బ్యాటరీలలో తలెత్తిన లోపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50కి పైగానే డ్రీమ్‌లైనర్లను నిలిపివేశారు. తక్షణమే రంగంలోకి దిగిన బోయింగ్‌ సంస్థ.. ఇలాంటివి పునరావృతం కాకుండా పాత బ్యాటరీల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే డ్రీమ్‌లైనర్ల రాకపోకలపై విధించిన నిషేధాన్ని పౌరవిమానాయాన శాఖ (డీజీసీఏ) గత వారం ఎత్తివేసింది.

,