తెలంగాణపై కేంద్రం ఏది చెప్తే అదే..

బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ పెడితే అక్కడే ఖనిజం
కరీంనగర్‌కు మెడికల్‌ కళాశాల
హుస్నాబాద్‌కు పాలిటెక్నిక్‌ : సీఎం కిరణ్‌
కరీంనగర్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్రం ఏది చెప్తే అదే తన విధానమని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ముల్కనూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు వినేది కాంగ్రెస్‌ పార్టీ అని, దళారీల మాటలు వినేవారు చంద్రబాబు అని దుయ్యబట్టారు. బయ్యారంలో  ఉక్కుప్యాక్టరీ కోసం రాష్ట్రీయ  ఇస్కాన్‌నిగమ్‌ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పొందం కుదుర్చుకున్నామని అది చూడకుండానే తమను వేలెత్తి చూపుతున్నారని అన్నారు. 55వేల హెక్టార్లలో ముడి ఇనుముకుగాను 42 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుక రాష్ట్రీయ  ఇస్కాన్‌నిగం లిమిటెడ్‌ ముందుకు వచ్చిందని అన్నారు. దీంతో ఇక్కడి ఖనిజాన్ని ఇక్కడే వినియోగిస్తామన్నారు. రక్షణ స్టీల్స్‌కు ఈ భూముల కట్టబెట్టినప్పడు టీడీపీ, టీిఆర్‌ఎస్‌ బెల్లంకొట్టినట్లు వుండిపోయాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి పెడుతోందని ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడం లేదని అన్నారు. దీనిని అడ్డుకోవడం తగదని చెప్పారు. ఎస్సీ ఉపప్రణాళిక బిల్లుకు కొన్ని లోలుసుగులు ఉపయోగించుకొని టిడిపి టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సిపిలు అపేందుకు కుట్రలు చేశాయని అన్నారు. నడక మిత్రుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లు వచ్చేప్పుడు తన నడకను ఆపి అసెంబ్లీకి వస్తాడని చూశానని అయితే చంద్రబాబుకు అలా చేయలేదని విమర్శించారు. ఎస్సీ ఉప ప్రణాళిక వల్ల నిధులు ఏదైనా కారణాల వల్ల సకాలంలో వెచ్చించకపోతే అవి మురిగిపోయే ప్రమాదం వుందని మళ్లీ వచ్చే సంవత్సరంకు ఈ నిధులను కొత్తనిధులతో కలిపే అవకాశం వుంటుందని చెప్పారు. ఎస్సీ కాలనీలలో మౌలిక వసతులకల్పనకు వీటిని ఉపయోగిస్తామని ఇకపై ఈ నిధులను ఇతర పనులకు మళ్లించలేమని చెప్పారు.ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.12250 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఎస్సీలకు ఇంటి నిర్మాణంకు లక్షరూపాయలు, ఎస్టీలకు లక్షా ఐదువేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇతర దేశాలకు వెళ్లి చదువుకొనే ఎస్సీ దారిద్య్రరేఖ దిగువన వున్న యువతకు పది లక్షల రూపాయల గ్రాంటు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు రూ.1150 మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేశౄమనిచెప్పారు. రాజీవ్‌ యువకిరణాల కింద రెండులక్షల 60వేల మందికి రూ.1150 కోట్లతో సబ్సిడీ ద్వారా స్వయం ఉపాధికి నిధులు విడుదల చేస్తున్నామని బ్యాంకు కూడా అదనంగా ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. బిసిలకు రూ.4027 ఖర్చు పెడుతున్నామని తెలిపారు. మైనార్టీలకు తెలుగుదేశం హయాంలో రూ.36 కోట్లు ఇస్తే తాము ఈ ఒక్క సంవత్సరం రూ.1027 కేటాయించామని తెలిపారు. మహిళా పారిశ్రామిక వాడల కోసం ప్రతి జిల్లాకు 30 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్త్రీనిధి కింద గ్రామీణ మహిళలకు 1,06,500కోట్ల రూపాయలు ఇస్తామని తెలిపారు. ఆత్మవిశ్వాసం కల్పించాలని ఇది తాము మహిళలకు ఇస్తున్నామని చెప్పారు. అమ్మహస్తం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
భావోద్వేగాల పార్టీలకు మనగడలేదు : బొత్స
భావోద్వేగాల పార్టీలకు మనగడ వుండదని అవినీతి పార్టీలు కర్ణాటకలో ఎలా ఓటమిపాలయ్యాయో ఇక్కడ కూడా అదే ఘటన పునరావృత్తం అవుతుందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సామన్యుడి ఆశలకు అనుగుణంగా పాలన చేసే పార్టీలకే భవితవ్యవం వుంటుందని భావోద్వేగంపై రాజకీయాలు చేసేవారు గుర్తుంచుకోవానలి. భావోద్వేగాలు తాత్కాలికంగా వుంటాయని జాతీయ దృక్పథం శాశ్వతంగా వుంటుందని అవినీతి డబ్బులతో రాజకీయాలు ఎంతో కాలం చేయలేరని అన్నారు.