తెలంగాణపై విషం కక్కడం సరికాదు
దశాబ్దాలుగా దగాపడ్డ, వెనకేయబడ్డ తెలంగాణ అభివృద్దికి ఇప్పుడే అడుగుపడుతున్న వేళ. పురుడు పోసుకుని కేవలం రెండేళ్లు మాత్రమే కావడంతో బుడిబుడి అడుగులు వేస్తున్నా, తప్పటడుగులు వేయకుండా సాగుతున్న వేళ ఇది. అందుకే తెలంగాణ గట్టిగా నిలబడాలంటే ఏం చేయాలి. ఏం చేస్తే తెలంగాణ వెనకబాటు పోతది. ఇవన్నీ ఆలోన చేసే నాయకుడు, ఉద్యమ నేత సింగా ఉండడంతో ప్రాధాన్య రంగాలకు బీజం వేసారు. నీళ్లు,నిధులు,నియామకాలు అన్న ట్యాగ్ లైన్‌తో మొదలయిన ఉద్యమం తెలంగాణ ఏర్పడ్డ తరవాత అదే ఉద్యమ స్ఫూర్తితో సాగుతున్నది. అందుకే తొలుత విద్యుత్‌పై విజయం సాధించారు. ఇప్పుడు నియామకాలు జరుగుతన్నాయి. ఇక నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ దూసుకుని వస్తుననాయి. ఇదే సందర్భంలో సాగునీటి రంగంలో విప్లవం తీసుకుని వచ్చేందుకు ప్రాజెక్టుల పునర్నిర్మాణంతో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలు వంటి ప్రాజెక్టులను చేపట్టారు. కానీ ఇక్కడే అసలు రాజకీయం మొదలయ్యింది. ఇవి అక్రమని ఎపి సిఎం చంద్రబాబు సహా అక్కడి వైకాపా అడ్డుతగులు తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు మాత్రం రీడిజైనింగ్ అంతా ముడుపుల కోసం అంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నాయి. ఈ దశలో సిఎం కెసిఆర్ ఎలాంటి బెదరింపులకు లొ/-గనని తేల్చారు. ప్రాజెక్టులు కట్టి చూపుతామని అన్నారు. నిజానికి గత పదేల్లలో ఉమ్మడి రాస్టంలోనే ఇవి చేసివుంటే ఇన్ని బాధలు వచ్చేవా అన్న ప్రశ్న కాంగ్రెస్ వేసుకోవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏనాడు కూడా ముందు చూపు లేకుండా ముందుకు సాగుతుంది. భవిష్యత్‌పై దానికి ఆలోచన ఉండదు. అందుకే గత పదేళ్లలో కాంగ్రెస్ పాలనలో దేశంలోనూ రాష్ట్రంలోనూ సమస్యలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అవినీతి పాలన కారణంగా ఇప్పుడు ఈ సమస్యలు తెలంగాణకు ఆటకంగా మారాయి. అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లు మళ్లీ అధికారంలో ఎలా ఉండాలన్న ఆలోచనలతో అభివృద్దికి బదులు ఓటుబ్యాంక్ రాజకీయ పథకాలకు తెరదీస్తుంది. అదే ఇప్పుడు తాగునీటి, సాగునీటి రంగాల్లో తెలంగాణను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రాజెక్టుల విషయంలో కావచ్చు..చిన్ననీటి పారుదలరంగం విషయంలో గావచ్చు..విద్యుత్ విషయంలో కావచ్చు కాంగ్రెస్ చేసిన పాపాలు అంతా ఇంతాకాదు. ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలన్నీ గతంలో చేసివుంటే రాష్‌టరంలో ఆందోళన చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు రాదు. కానీ రాజకీయాలు చేయడంలో అందెవేసిన చేయికనుక కరవు పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కరువు తాండవించడానికి గత పదేళ్ల కాంగ్రెస్ దుష్టపాలన తప్ప మరోటి కాదు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇప్పడు ప్రాజెక్టుల నిర్మానం కూడా ఓ మహాయజ్ఞంగా సాగుతున్న వేళ ఇది. ఈ సందర్భంలో కాంగ్రెస్ విమర్వలుచేసుకుంటూ నోరుపారేసుకోవడం దాని దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత ఉత్పత్తి రంగంపై కెసిఆర్ దృష్టి సారించి చేస్తున్న కృషి రానున్న రెండుమూడు ఏళ్లలో మంచి ప్రభావం చూపనున్నాయి. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆర్డీఎస్ ఆధునీకరణ.. ఎనిమిదేండ్ల కిందటి ప్రాజెక్టు అని, ఉమ్మడి రాష్ట్రంలోనే నిధులు మంజూరయ్యాయని నీటిపారుదలశాఖమంత్రి హరీష్ రావు ఇప్పటికే స్పష్టంచేశారు. దీనికి ఏపీ పునర్విభజన చట్టానికి ఎలాంటి సంబంధం లేదు. ఇక పులిచింతల ప్రాజెక్టు. తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు మలుపుకుపోయిన ప్రాజెక్టు. ఏండ్లు గడిచి, రాష్ట్ర విభజన జరిగి రెండేండ్లయినా తెలంగాణలోని ముంపు బాధితుల బాధలు తీరలేదు. విభజన చట్టంతో ఏమాత్రం సంబంధం లేని అంశమిది. కానీ, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కాదు… ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సైతం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు… విభజన చట్టం ఉల్లంఘన… పదాలే వల్లిస్తున్నారంటూ మండిపడ్డారు. నిజానికి కేటాయింపులు ఉన్న జలాల ఆధారంగానే కాళేశ్వరం లేదా ఇతర ప్రాజెక్టులుకడుతున్నట్లు సిఎం కెసిఆర్ కూడా స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్‌లో కేటాయించిన హక్కు మేరకు ఆర్డీఎస్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు దక్కాల్సిన 15.90 టీఎంసీలు అందుతాయి. కానీ, కర్నూలు రైతులు పనుల్ని అడ్డుకోవడం వల్ల అసంపూర్తి ఆధునీకరణతో కొన్నేండ్లుగా నాలుగైదు టీఎంసీలు కూడా రావడం లేదు. దీంతో మంత్రి హరీశ్‌రావు ఇటీవల బెంగళూరుకు వెళ్లి కర్ణాటక జల వనరుల శాఖ మంత్రితో మాట్లాడారు. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ, ముంపునకు గురవుతున్న ఆలయాలు, శ్మశానవాటికలు, తెలంగాణకు చెందిన పలు లిఫ్టు స్కీంల అంశాలపై పరిష్కారం కనుగొనాల్సి ఉన్నది. వాస్తవంగా ఇవి పరిష్కారమైతే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఆంధప్రదేశ్‌గా ఉన్ననాడు సమైక్య రాష్టాల్ర సీఎం, ఇరిగేషన్ మంత్రులు శాసనసభాపూర్వకంగా ఇచ్చిన హావిూలు, అధికారికంగా ఇచ్చిన ఉత్తర్వులు తెలంగాణకు కేటాయించినటువంటివి.. 368 టీఎంసీలు కృష్ణా నదిలో, 8950 టీఎంసీలు గోదావరి నదిలో ఉన్నాయని సిఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే కాదు.. ఆ ప్రాజెక్టులు ప్రారంభించి కొన్ని వేల కోట్ల రూపాయలు వాటి విూద ఖర్చు పెట్టినట్లు కెసిఆర్ ఎప్పుడో చెప్పారు. పాలమూరు-రంగారెడ్డికి కూడా రూ.7కోట్లు సర్వే కోసం ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. ఇవన్నీ వాస్తవాలు. ఏపీలో వాళ్ల రాజకీయ ఎత్తుగడల కోసం, రాజకీయ అవసరాలు, చిల్లరమల్లర రాజకీయాలకోసం పోటీ పడి ఈ రోజు చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడు జగన్ మన విూద యుద్ధం ప్రకటిస్తున్నారంటూ కెసిఆర్ ఘాటుగానే స్పందించారు. వాస్తవాలను కప్పిపుచ్చేప్రయత్నంచేయొద్దని కెసిఆర్ చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు అభివృద్ది పట్టాలకు ఎక్కుఉతన్న వేళ విషం కక్కడం సరికాదు. ఇరు రాష్టాల్ల్రో ఉన్నది తెలుగువారు అన్నది గుర్తించాలి. కర్నాటక, మహారాష్ట్రలు నిజంగానే అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ముడుచుకు కూర్చున్న నేతలు ఇవాళ అడ్డుకునే ప్రయత్నాలుచేయడం తెలంగాణ బిడ్డలను అవమానించడం కా మరోటి కాదు.