తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమైనది
దుబాయి పారిశ్రామికవేత్తల సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్
దుబాయ్, డిసెంబర్ 14 జనంసాక్షి : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ కోరారు. దుబాయ్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆదివారం నాడు ఆయన మాట్లాడుతూ తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమైనదనీ, ఏకగవాక్ష విధానంలో అన్ని అనుమతులు ఒకే పత్రంలో ఇస్తూనామనీ ఆయన వివరించారు. పలువురు పారిశ్రామిక వేత్తలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని స్మార్ట్‌సిటీని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించారు. కేటీఆర్‌తో పాటు స్మార్ట్‌సిటీని రాష్ట్ర ఇండస్ట్రీస్ చీఫ్ సెక్రటరీ కె.ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ, కమిషనర్ ఎం. జయేశ్‌రంజన్, ఫిక్కి ప్రతినిధులు సందర్శించారు. స్మార్ట్‌సిటీ సీఈవో అబ్దుల్ లతీఫ్ అల్‌ముల్లా, ఎండీ డాక్టర్ బాజు జార్జ్‌లతో సమావేశమయ్యారు. ఐటీఐఆర్‌లో భాగంగా హైదరాబాద్‌లో స్మార్ట్‌సిటీ అభివృద్ధిపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ విజన్‌ను లతీఫ్ అల్‌ముల్లా మెచ్చుకున్నారు. వచ్చేవారం తాను హైదరాబాద్ వస్తానని లతీఫ్ అల్‌ముల్లా హావిూ ఇచ్చారు. దుబాయ్‌లో ప్రస్తుతం ఉన్న స్మార్ట్‌సిటీలో ఐటీ కంపెనీలతో పాటు అక్కడే ఉద్యోగులకు నివాసాలు, కమర్షియల్ బిల్డింగ్‌లు కూడా నిర్మించారు. ఇక్కడ నివసించే వారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు మెరుగైన జీవితం కొనసాగించేందుకు స్మార్ట్‌సిటీలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన్రని కేటీఆర్ తెలిపారు. యూరప్‌లోని మాల్టాలో ఉన్న స్మార్ట్‌సిటీ స్పూర్తితో దుబాయ్‌లో స్మార్ట్ సిటీని నిర్మించారని గుర్తు చేశారు.