తెలంగాణలో సీమాంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి
– తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌కరీంనగర్, జూలై 5 (జనంసాక్షి) : తెలంగాణ సహజ వనరులను దోపిడి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా సంపాదించిన దోపిడి సొమ్ముతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అడ్డుకుంటున్న సీమాంధ్ర ఆర్థిక మూలా లను దెబ్బతీయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన క్యాదర్శి పిట్టల రవీందర్ పిలుపునిచ్చారు. విద్యావంతుల వేదిక కరీంనగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రెస్ భవన్‌లో జరిగిన పర్లపల్లి బయోప్లాంట్ ఎవరి కోసం అనే ఆంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశా న్ని ఆయన ముఖ్య అతిథిగా హజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ సీమాంధ్ర పెట్టుబడిదారుల అండతో తిమ్మాపూర్ మండలం పర్ల పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హరిత బయోప్లాంట్‌ను శాశ్వతంగా మూసి వేయాలని గ్రామస్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ నాయకుడు సుగుణాకర్‌రావు మాట్లాడుతూ పర్లపల్లి ప్రజల పక్షాన నిలిచి పోరాడుతామన్నారు. బయోప్లాంట్‌పై న్యాయపో రాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తేవివే జిల్లా అధ్యక్షుడు ముక్కెర రాజు, సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తేవివే కరీంనగ ర్ డివిజన్ కన్వీనర్ జొక్కజూ వెంకటేశ్వర్లు, ఆవునూరి సమ్మయ్య, జేఏసీ జిల్లా కమిటీ కన్వీనర్ జె.రవీందర్, కో-కన్వీనర్ విజయానంద్, జేవిరావు, సల్లోజు కమలాకరాచారీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు రుక్మిణి, ఆంధ్ర ప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, మాదర కుమార్, జక్క నపల్లి గణేష్, టి.శ్రీనివాస్, కె.గంగరాజు, నర్సయ్య, గోపాల్, దేవెంద ర్‌రెడ్డి, తిరుపతి, మహ్మద్ వలీపాషా, కనుకం కొమురయ్య, గాలి ప్రభాకర్, అశోక్, రాజేందర్, నర్సయ్య, రవిందర్‌రెడ్డి, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.