తెలంగాణలో 6 జాతీయ రహదారులు జాతికి అంకితం..
హైదరాబాద్,డిసెంబరు 21 (జనంసాక్షి):తెలంగాణలో రూ.13,169 కోట్లతో 766 కిలోవిూటర్ల మేర గల 14 జాతీయ రహదారుల్లో 8 జాతీయ రహదారులకు భూమి పూజ చేసి, 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని పూర్తయిన 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. మిగతా 8 రహదారులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.