తెలంగాణ అభివృద్ధికి సహకరించండి
-జలహారం, మిషన్ కాకతీయకు 50శాతం నిధులు కేంద్రం భరించాలి
-ప్రాణహిత, చెవేళ్లకు జాతీయ హోదా కల్పించాలి
-హైకోర్టు విభజనకు సహకరించండి
-మిషన్ కాకతీయ శంకుస్థాపనకు మోదీకి ఆహ్వానం
-ప్రధానితో సీఎం కేసీఆర్ భేటి
న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన అధికార పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో ఆయన నివాసంలో అరగంటపాటు సమావేశం అయ్యారు. రాష్టాన్రికి సంబంధించి పలుకీలక అంశాలపై ఆయన ముఖాముఖీగా చర్చించారు. రాష్ట్ర సమస్యలు, విభజన హావిూలు, రాయితీలు, ప్యాకేజీలపై ఆయన ప్రధాని దృష్టికి తీసుకోచ్చరు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కేంద్రం ఇతోధికంగా సహయపడాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మిషన్ కాకతీయ శంకుస్థాపనకు హాజరు కావాలని పీఎంను ఆహ్వానించారు. బ్జడెట్‌లో రాష్టాన్రికి ప్రాధాన్యమివ్వాలని, పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని, ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ ¬దా కల్పించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. గోదావరి పుష్కరాలకు నిధులు సమకూర్చాలని కోరారు. జలహారం, మిషన్ కాకతీయకు 50 శాతం నిధులు కేంద్రం భరించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర నుంచి డిచ్‌పల్లి వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని, ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. దిల్లీ నుంచి ఆయన నేరుగా ముంబయి బయల్దేరి వెళ్లారు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కేసీఆర్ భేటీ అవుతారు. ప్రాణహిత- చేవెళ్ల, లెండి, ఇచ్చంపల్లి, పెన్‌గంగ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ఆయనతో చర్చిస్తారు. ఇరు రాష్టాల్ర మధ్య జలవివాదాఅఉ పరిష్కరించుకునే అంశాలపై చర్చిస్తారు.