తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింల ప్రార్థనా స్థలమైన మసీదులో దళితుల ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవు. దళితుల ప్రవే శంలో ఏ మసీదు మైలపడలేదు. దళితులు నీళ్లు తోడు కోవడం వల్ల ముస్లింల నీటివనరులు మైలప డవు. కానీ గుళ్లు-గోపురాలు, సవర్ణుల నీటివన రులు, ఇండ్లు దళితుల ప్రవేశంతో మైలపడటం గ్యారంటీ, శుద్దిచేయటం తప్పదు. అందుకే దళితుల ప్రవేశం నిషిద్దం. వాస్తవానికి ఏ దళితు డు దేవాలయానికి వెళ్లడు. కారణం ముస్లింలలాగే దళితులు కూడా హిందువులు కాదు కాబట్టి.

నరజాతి (ఆంత్రొపాలజి) అధ్యయనాల ప్రకా రం దళితులు భారతీయ ముస్లింలు ఒకే నర వరా ్గనికి చెందినవారు. వీరి కపాలాలు ముక్కులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మెజారిటీ దళితులు -ముస్లింలు ఆర్యులైన సవర్ణుల కంటే భిన్నంగా ఉంటారు.

డిసెంబర్‌ 6,1956న బ్రాహ్మణ కుట్రదారులు అంబేడ్కర్‌ను హత్య చేయించారు. ఈ రోజును బహుజనులంతా సంతాపదినంగా పాటిస్తారు. హిందుత్వవాదులు విజయదినంగా పాటిస్తారు. ఏ రోజయితే బాబాసాహెబ్‌ను చంపి విజయదినంగా జరుపుకుంటారో అదే రోజు అనగా డిసెంబర్‌ 6నే బాబ్రీ మజీదును కూల్చి దళితులు- ముస్లింలపై జాయింట్‌గా విజయదినం జరుపుకుంటున్నారు. ఈ విధంగా కూడా ఉమ్మడి శత్రువు మనలను సోదరులుగా గుర్తించారు. దీనిని ఉమ్మడిగానే సంతా పదినంగా పాటించాల్సిన అవసరం ఉన్నది.

దళితులు-ముస్లింలు ఉభయులు కూడ చనిపో యిన వారిని సమాధి చేస్తారు. కాని వీరికి భిన్నం గా సవర్ణులు మృతులను కాల్చి గాలి, నీరు, పర్యా వరణం కలుషితం చేస్తారు. శరీరాలు కాల్చేందుకు మిలియన్ల వృక్షాలు కొట్టివేస్తున్నారు.

మొదటి మొఘల్‌ పాలకుడు బాబర్‌, చరిత్ర ప్రసిద్ది పొందిన బౌద్ద పరిపాలకుడు జహంగీర్‌ ఖాన్‌ యొక్క వారసుడు. ఈ జహంగీర్‌ ఖాన్‌ మంగోలు తెగకు చెందిన బౌద్దుడు. ఇతను ఇస్లా మీకరణ చెందిన తదుపరి మొఘల్‌గా పిలువబ డినాడు. (భారతీయ సంస్కృతి, నాగరికత రచయి త డి.డి. కొశాంభి) కాబట్టి మొఘల్స్‌, ప్రస్తుత చాలామంది దళితులు, వెనుకబడిన తరగతులవ ా రు  ఒకే పూర్వీకుల నుండి వచ్చిన వారు అనేది చారిత్రక వాస్తవం.

జవహర్‌లాల్‌ నెహ్రూ 1951-52 సంవత్సరాల్లో ప్రఖ్యాత ఉర్దూకవి జోష్‌ మలిహాబాదీని వల్లభాయ్‌ పటేల్‌ను కలువమని కోరినాడు. నెహ్రూ మాట కాదనలేక పటేల్‌ను కలిసిన సందర్భంలో ‘మీరు ముస్లింలను ఎందుకు ద్వేషిస్తారు?’అని జోష్‌ అడి గారు. దానికి పటేల్‌ సమాధానం ‘మీలాంటి నవా బులను ద్వేషించను, ఎవరైతే నిన్నటిదాకా మాదిగ వాండ్లుగా, పాకి వాండ్లుగా పని చేసి ముస్లిం మతాన్ని పుచ్చుకొని నేడు సమాన హక్కులు కావా లంటున్నారో… వారిని మాత్రమే…’ అని అన్నారు. సాధారణ ముస్లిం ప్రజల పట్ల హిందూ సవర్ణుల ద్వేషం వెనుకనున్న చిదంబర రహస్యం వాండ్ల పూర్వీకులు దళితులు కావడమే. ఇది కూడా దళి తులు-ముస్లింలు సోదరులు అనే రహస్యాన్ని ఛేదించినది.

‘  భారత జాతిపిత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌’ 1931లో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని పోరాటం చేసినప్పుడు ఆయనకు ముస్లిం లు తప్ప మరెవ్వరు మద్దతు ఇవ్వలేదు. హిందు వుల జాతిపిత గాంధీ దీనిని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసిండు. 1946లో జరిగిన రాజ్యాంగ సభ ఎన్నికల్లో సవర్ణ కాంగ్రెస్‌ అంబేడ్కర్‌ను పగబట్టి ఓడించారు. కాని మరుసటి రాజ్యాంగ సభ ఎన్నిక ల్లో బెంగాల్‌ ముస్లింలు అంబేడ్కర్‌ను ఆహ్వానించి సీటిచ్చి గెలిపించి రాజ్యాంగ సభకు పంపడం జరి గింది. కేవలం ముస్లింల నుండి మాత్రమే మహా త్మా పూలే, నారాయణ గురు, పెరియార్‌ ఇ.వి రామస్వామిల ఉద్యమాలకు పూర్తి మద్దతు లభిం చింది. ఈ కారణాల వల్లనే బి.పి మండల్‌ తన మండల్‌ కమీషన్లో ముస్లింలను కూడా వెనుక బడిన తరగతుల జాబితాలో చేరుస్తూ ఒక సెక్షన్‌ రాసి రిజర్వేషన్‌ సౌకర్యం ముస్లింలకు కల్పిం చాడు. ఈ విధంగా ఏ ప్రాంతంలో కూడా, ఏ కాలంలో కూడా దళితులు-ముస్లింలకు మధ్య వైరుధ్యాలు లేవు. కేవలం గత సవర్ణులు లేవు. కేవ లం గత వంద ఏండ్ల నుండి ప్రధానంగా స్వాతం త్య్రానంతరం బ్రాహ్మణ వాద సవర్ణులు దళితులు -ముస్లింల మధ్య తగాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి దుర్మార్గ ప్రయత్నాలు విఫ లం కాక తప్పదు.

-డాక్టర్‌ రామ్‌నాధ్‌

అనువాదం: ఎండి, నజీరుద్దీన్‌, వకీల్‌, నల్గోండ

ముస్లింలు ముస్లింలుగా సంఘటితం కావాలి

భారత దేశంలో ముస్లింలు రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం, సామాజిక అవసరాల కోసం ఉద్య మించే సంస్థలు, సంఘాలు చాలా తక్కువ, మత సంస్థలున్నాయి. అందులో పరమత సహనాన్ని పా టించేవి ఉన్నాయి, పాటించనివి ఉన్నాయి. ముస్లిం సమాజంలో అంతర్గత సంస్కరణల కోసం, విద్య వంటి ప్రధాన సామాజిక రంగాలలో సేవలు అం దించడం కోసం, పని చేస్తున్న సంఘాలూ ఉన్నా యి. కానీ ఏ రంగంలో అయినా ముస్లింలను ముస్లింలుగా సంఘటితపరచి హక్కుల కోసం ఉద్యమించే సంస్థలు చాలా అరుదుగా కనిపి స్తాయి.

సహజ క్రమంలోనే హక్కులు ఒనగూడినట్టయితే అటువంటి ఉద్యమాలూ ఉద్యమ సంస్థలూ లేక పోవడం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ స్వాతంత్య్రం తరువాత అభివృద్ది ఫలితాలను అతి స్వల్పంగా అందుకున్న సామాజిక వర్గాలలో ము స్లింలను ప్రముఖంగా చెప్పుకోవలసి ఉంటుంది. దేశ జనాభాలో ముస్లింల వాటాతో పోల్చుకుంటే విద్య,ఉద్యోగం,రాజకీయ ప్రాతినిధ్యం అనే మూడు రంగాలలోనూ ముస్లింల వాటా చాలా తక్కువ. నిరక్షరాస్యతలోనూ పేదరికంలోనూ చాలా ఎక్కు వ. వేరే ఏ సామాజిక వర్గం పరిస్థితయినా ఈ విధంగా ఉండిఉంటే వారు ఈపాటికి సంఘటిత మయి తమ న్యాయమైన వాటా కోరి ఉందురు. అది న్యాయమే నన్న ఆమోదం పొంది కూడ ఉం దురు. కానీ ఈ ముస్లింలు అడగడం లేదు. అడగ డానికి సంఘటితం కావడం లేదు. అడిగితే హిందూ సమాజం ఆమోదం లభిస్తుందన్న నమ్మ కమూ లేదు.

తల్లిదండ్రుల పాపాలకే కాక తల్లిదండ్రులకు ఆపాదించబడ్డ పాపాలకు కూడ పిల్లలను సమా జం బాధ్యుల్ని చేసినట్టు దేశ విభజన ముస్లింల పాపమేనంటూ అప్పటి తరానికి చెందిన ముస్లిం లకు ఆపాదించబడిన పాపానికి తరువాతి తరానికి చెందిన ముస్లింలు భౌతికంగానే కాక మానసికం గా పరిహారం చెల్లిస్తున్నారు. ఆ ఆపాదన న్యాయం కాదు, అది న్యాయమే అయినా తరువాత తరం మీద వేసిన భారం ఎంత మాత్రం న్యాయమైనది కాదు.

బ్రిటిష్‌ వాళ్లకు విభజించి పాలించే నీతి ఉండందనీ, హిందువులు-ముస్లింలు, అణగారిన కులాలు-అగ్రకులాలు, ఆదివాసులు-బయటివారు అంటూ భాదత సమాజాన్ని ఎక్కడికక్కడ విభజించి తమ ప్రయోజనాలు సాధించుకున్నారనీ ఒక అభి యోగం ఉంది. అభ్యుదయవాదులు సహితం ‘బ్రిటిష్‌వారి విభజించి పాలించే నీతి’ అని తరచు గా అంటుంటారు. దేశ స్వాతంత్య్రం ప్రస్తావన వచ్చినప్పుడు, స్వాతంత్య్రమంటే అగ్రవర్ణ హిందు వుల పాలనే అవుతుంది. కాబట్టి మైనారిటీలు, అణగారిన కులాల ప్రయోజనాలకు ఈ డిమాండ్‌ నష్టకరమని బ్రిటిష్‌ వాళ్లు తమ పాలనను సమర్థిం చుకున్న మాట వాస్తవమే. మైనారిటీలు, దళితుల రాజకీయ ప్రతినిధుల సాధికారతను గుర్తించి ఆ ప్రజల ప్రయోజనాల నిమిత్తం వారితో చర్చలు, సంప్రదింపులు పెట్టుకున్న మాటా వాస్తవమే. ఇందులో బ్రిటిష్‌ వాళ్ల స్వార్థంఉందనబంలో సంద ేహమేమి లేదుగానీ ఈ తేడాలను ఆ స్వార్థం సృష్టిం చిందా లేక వాటిని వాస్తవికంగా గుర్తిస్తూ పనిలో పనిగా తన ప్రయోజనాలు ఒనగూర్చకుండా అన్న ప్రశ్న వేసుకోకుండ బ్రిటిష్‌ వలసవాదుల విభజిం చి పాలించే నీతి గురించి ఊక దంపుడు ఉపన్యా సాలు ఇవ్వడం భావ్యం కాదు.

బ్రిటిష్‌ వారి విభజించి పాలించే నీతి అనేది ముస్లింలకు సంబంధించి ఎక్కువగా ఈ రోజు ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. గానీ బ్రిటిష్‌ పాల కులు మూడు ప్రధాన మైనారిటీ వర్గాలను గుర్తించారు. ముస్లింలు, సిక్కులు, అణగారిన వర్గా లు (నేటి భాషలో దళితులు). ఈ మూడు సామాజి క వర్గాలలోనూ స్వాతంత్య్రం అంటే అగ్రవర్ణ హిందువుల పాలనే అవుతుందన్న సహేతుకమైన సందేహం ఉండింది. ముగ్గురిలోని ఈ భయాన్నీ బ్రిటిష్‌ వాళ్లు ఒక వాస్తవంగా గుర్తించారు. తమ వలస పాలన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారు. ముగ్గురి విషయంలోనూ ‘జాతీయ’ పార్టీ అయిన కాంగ్రెస్‌ సరయిన అవగాహన ప్రదర్శించలేదు. వారి భయాలను సహేతుకమైన విగా అర్థం చేసుకోలేదు. వాటిని పోగొట్టడానికి గట్టి కృషి ఏమీ చేయలేదు. ఈ సామాజిక వర్గాల భవిష్యత్తు స్వతంత్య్ర భారతంలో ఏ విధంగా ఉండ బోతుందోనన్న భయాన్ని వ్యక్తం చేసిన నాయ కులను కాంగ్రెస్‌ వారు బ్రిటిష్‌ ఏజెంట్లు అంటూ నిందించారు. అంబేడ్కర్‌ అంతటి వాడికే అది తప్పలేదు. అయినప్పటికీ స్వాతంత్య్రం తరువాత సిక్కు ప్రజానీకం, దళిత ప్రజానీకం ఏ ‘పాప భారా న్నీ’ మోయవలసిన అవసరం లేకుండా తమను తాము సామాజిక వర్గాలుగా సంఘటితం చేసు కుంటూ తమ హక్కుల గురించీ అవసరాల గురిం చీ ఆందోళన చేస్తున్నారు. ఒక్క ముస్లింల కథ మాత్రమే భిన్నంగా ఉంది.

చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, రెండవ ప్రపంచ యుద్దం ముగింపు దశలో, భారత్‌కు ఇంగ్లండ్‌ స్వాతంత్య్రం ఇవ్వక తప్పదన్న వాతా వరణం ఎప్పుడయితే ఏర్పడిందో అప్పటి నుండి 1947 జూలై నెల దాకా కూడ స్వతంత్ర భారతం ఏకీకృత రాజ్యంగా కాక భిన్నత్వాల సమ్మేళనంగా ఉంటుందన్న అభిప్రాయమే బలంగా ఉండింది. ఒక్క ముస్లింల విషయంలోనే కాదు, ముస్లింలు, సిక్కులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో-ఇండియన్లు- వీరం దరికి రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగాలలో రిజర్వే షన్లు , బహుశా ప్రత్యేక నియోజకవర్గాలు కూడ ఉండాలని, ముస్లింలు, సిక్కులు, ఆదివాసీ జాతు లు అధికంగా నివసించే వాయువ్య, ఈశాన్య ప్రాంతాలకు స్వంత రాజ్యాంగాలతో సహా స్వయం ప్రతిపత్తి ఉండాలనీ అయిష్టంగానే కానివ్వండి కాంగ్రెస్‌  వారు సహితం అంగీకరించారు. దేశ విభజన నుండి వచ్చిన చీలికల భయాన్ని ఆసరా చేసుకోని ఒక్క ఎస్‌సి ఎస్‌టిలకు తప్ప వేరే ఎవ్వరి కీ ప్రత్యేక రక్షణ ఇవ్వని పద్దతిలో రాజ్యాంగం ముసాయిదాను తిరగరాసి ఏకీకృత రాజ్యాన్ని నెలకొల్పడంలో కాంగ్రెస్‌ వారు కృత కృత్యుల య్యారు.

-వేముల ఎల్లయ్య,స్కైబాబ

ఇంకావుంది…