తెలంగాణ అలాయ్ బలాయ్
బ్రిటిష్ పాలన కాలంలో 1925 నుండి మైనా రిటీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉండే వి 1934లో దానికి ఒక నిబందన రూపం ఇచ్చి ముస్లింకు 25 శాతం రిజర్వేషన్లు,ఇతర మైనారిటీ లకు 8.5శాతం రిజర్వేషన్లు ఖరారు చేసారు. 19 32 తరువాత అప్పటి పరిమిత ప్రాతినిధ్యం ప్రాతి పదికన జరిగిన ఎన్నికలలో అన్ని మైనారిటీ వర్గా లకూ ప్రత్యేక నియోజక వర్గాలనే కేటాయించారు.
1946 డిసెంబర్ 9న మొట్టమొదటిసారి సమువే శమైన రాజ్యాంగ పరిషత్ తాను రూపోందించబో తున్న భారత రాజ్యాంగాన్ని ఏకీకృత నమూనాలో భావించుకోలేదు. వామువ్య ప్రాంతం ఒక సెక్షన్ గా తక్కిన దేశం ఒక సెక్షన్‌గా ఉంటాయనీ, ఏ సె క్షన్‌కు దాని ప్రాంతీయ రాజ్యాంగం ఉంటుందనీ, ఒక సెక్షన్‌లో ఉంచబడ్డ రాష్ట్రానికి ఆ సెక్షన్‌లోనే కొనసాగాలా లేక వేరే సెక్షన్‌లో చేరాలా అని నిర్ణ యించుకునే స్వేచ్చ ఉంటందనీ ఆనాడు భావించారు.
మైనారిటీల హక్కుల గురించి సూచనలివ్వడం కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ పరిషత్ సబ్ కమిటీ 1947 జూలై 27న సమఅయర్పించిన నివేదికలో, ముస్లిలకు,సిక్కులకు, భారతీయ క్రైస్త వులకు, ఆంగ్లో ఇండియన్లకు, ఈశాన్య ప్రాంత ఆదివాసులకు, ఆఇతర ప్రాంతాల ఆదివాసులకు, దళితులకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలన్న సూచన సబ్‌కమిటీలో బలంగా చర్చకు వచ్చింది గానీ, ఒక్క వోటుతో వీగిపోయి వారి ప్రాతిపాద నలో భాగం కాలేదు. దేశ విభజన వల్ల హిందువు లలో పెల్లుబికిన ఉద్రేకాన్నీ ముస్లింలలో నెలకోన్న అపరాధ భావననూ ఆసరా చేసుకొని కాంగ్రెస్ నాయకులు తొలుత ప్రతిపాదించన రూపానికి గు డ్‌బై చెప్పి,ఎస్‌సి,ఎస్‌టీలకు తప్ప తక్కిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు నిరాక రించి అందరినీ పౌరులు చేసేసి అధికార కేంద్రీక రణను సహితం బాగా పెంచి ప్రస్తుతం ఉన్న రూ పంలో రాజ్యాం రచనను ముగించారు. అదే జరగ కపోతే మన రాజకీయ వ్యవస్థలోనూ పాలనా వ్య వస్థలోనూ మైనారిటీల ప్రత్యేక ప్రతిపత్తి బలమైన అంశంగాఉండేది.రాష్ట్రాలకుస్వంత రాజ్యాంగాలు ఉండే ఫెడరల్ వ్యవస్థునూ మైనారిటీలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే జ్రాతంత్ర విలువనూ తిరస్క రించే తీర్మానాన్ని రూపోందించడంలోనూ రాజ్యాం గ పరిషత్ చేత ఓకే చేయంచడంలోనూ నెహ్రూ, పటేలూ ఇద్దరూ పెద్ద పాత్ర పోషించారు. నెహ్రూ ఆదర్శాలు ప్రవచించి ఈ పని చేయగా పటేల్ దేశ సమగ్రత పేరు మాద చేసాడు. 1947 జూలై 27 న మైనారిటీల సబ్‌కమిటీ చేసిన ప్రతిపాదనను 1949 మే 11న రాజ్యాంగ పరిషత్ సలహా కమి టీ తిరస్కరించింది.(ఒక్క ఎస్‌సి, ఎస్‌టిల విష యంలో తప్ప).
దీని ఫలితాన్ని ఈ రోజు ముస్లింలు అనుభవి స్తున్నారు. క్రైస్తవులలో దళిత క్రైస్తవులు తరువాతి కాలంలో వచ్చిన జిసి రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందగలిగారు. క్రైస్తవులము కామని చెప్పుకోగలి గిన చోట షెడ్యూల్డు కులాల ప్రత్యేక ప్రతిపత్తిని పంచుకోగలిగారు. సిక్కులలో ఒక ధనిక వర్గం, విద్యావంతుల వర్గం ఉండడం వల్ల ప్రత్యేక రా జ్యాంగ ప్రతిపత్తి ఏదీ లేకున్నా హైందవ సమాజం తో పాటు నడవ గలుగుతున్నారు. ముస్లింలలో డబ్బు, చదువు ఉన్న వర్గాలు పాకిస్తాన్‌కు వెళ్లిపో వడం వల్ల,పోనిచోట పెట్టుబడిదారీ ఆధునికతలో భాగం కాలేకపోవడం వల్ల. ముస్లిం సమాజం స్థితి వేగంగా దిగజారింది.
వేరే ఎవరయినా అయితే దీనిని ఎదుర్కోన డానికి సంఘటితమవుదురు.ఆత్మస్థైర్యంతో మా హక్కులు మాకిమ్మని అడుగుదురు. ముస్లింలు ఈ మార్గం ఎంచుకోకపోవడానికి ముస్లిం సమాజా నికి అంతర్గతమైన కారణాలు లేకపోలేదుగానీ, హైందవసమాజంఏవిధంగా స్పందింస్తుందోనన్న భయం ఒకముఖ్యకారణం.కొన్నాళ్ల కింద ముస్లిం పార్టీ పెట్టబోతున్నామని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్లిం ప్రముఖులు ప్రకటించగా, ఒకప్పటి జన తా పార్టీ నాయకుడయిన సురేంద్ర మోహన్ వం టి వ్యక్తి ‘తొందరపడి అంత పని చేయొద్దు సుమా’ అంటూ సుదీర్ఘమైన ఉపదేశ వ్యాసం రాసాడు.
హైందవ సమాజం ఆగ్రహిస్తుందని పోలీసులు అనుమానిస్తారని ముస్లింలు ఎందుకు ఆగాలి? దేశ జనాభాలో తమ వాటాలో నాలుగో వంతు కూడ ఉద్యోగ రంగంలో, విద్యారంగంలో, రాజకీ య వ్యవస్థలో లేని స్థితిని ఎందుకు సహించాలి? ఈ స్థితికి ముస్లిం సమాజంలోని అంతర్గత కార ణాలు కూడ లేకపోలేదు. అయితే వాటిని గురించి ఏమైనా చేయాలన్నా ముస్లింలు ముస్లింలుగా సం ఘటితము అవుతాయి. తాము ఈ దేశంలో బాగా బతకడం ఒక సహజమైన హక్కు అన& ఆత్మ స్థైర్యంతో వ్యవహరించగలగడం అవసరం. సమా జం నుండి, ప్రభుత్వం నుండి హక్కులు పొందా లంటే అటువంటి సంఘటన ఎట్లాగూ అవసరమే.
మీరు ముస్లిం సంఘాలూ పార్టీలు పెట్టుకొని హైందవ సమాజంలో ‘ఇది ఇంకొక వేర్పాటుకు దారి తీస్తుందేమో’నన్న అనుమానానికి తావు ఇచ్చే బదులు ప్రగతిశీల రాజకీయాలలొ భాగమయి అందరితో పాటు మీ హక్కులూ పోందండి అని ముస్లింలకు హితవు చెప్పే అభ్యుదయవాదులు తే కపోలేదు. అణగారిన సామాజిక వర్గాలు తాము గా సంఘటితం కావడం అవసరమని అంటే ఎవ రికివారు అభేద్యమైన కోటలు కట్టుకొని కూర్చోవా లని కాదు. కలవగల చోట, కలవవలసిన చోట ఒకరితోఒకరుకలవవలసిందే. కానీ విడిగా సంఘ టితం కానిదే హక్కుల సాధన సంగతి అటుంచి, వాటి సమగ్ర వ్యక్తీకరణ కూడా సాధ్యం కాదన్నది వాస్తవం. ఆ విషయం గుర్తించిన తరువాతే కుల సంఘాలు అంటూ అభ్యుదయవాదులు ఈసడిం చుకునేపలుదళితబహుజన సంగాలు ఏర్పడాయి.
ముస్లింలు ముస్లింలుగా సంఘటితం కావాలి అం టున్నామంటే ముస్లిం సమాజంలో అంతర్గత విభ జన లేదనీ అది ఒకే మూస పోసినట్టు ఉందనీ కూడాఅర్థంకాదు. ముస్లింలు ఏ గొడుకో వెతుక్కో నక్కర లేదనీ తమ పేరు మీద తాము సంఘటితం కావాలనీ మాత్రమే అంటున్నాం.మనదగ్గర కంటే ఉత్తర భారత దేశంలో ముస్లింలలో అష్రాఫ్ వరా ్గనికీ దళిత బహుజన కులాలకూ మధ్య తేడా చాలా ప్రస్పుటంగా ఉందని అంటారు. మండల్ కమీషన్ తరువాత ఈ తేడా మరింత కొట్టొచ్చి నట్టువ్యక్తమవుతున్నదని కూడ అంటారు. అప్పుడు దళిత బహుజన కులాలకు చెందిన ముస్లింలు విడిగాసంఘటితంకావడం భావ్యమనుకుంటే అదీ న్యాయమే.
దేశ విభజనకు కారణమయ్యారే పుట్టుమచ్చే కాక ఈ మధ్య కాలంలో ఐఎస్‌ఐ బూచి కూడా ముస్లిం ప్రజల రాజకీయ వ్యక్తీకరణ కొక ప్రతిబం ధకంగా తయారయింది. హైదరాబాద్ పాతబస్తీ లో ఈ మాట తరచుగా వింటుంటాం. పాతబస్తీ లో ముస్లింలనయినా హిందువులనయినా వారి దై నందిన జీవిత అవసరాలకొసం సామాజిక ఆర్థిక హక్కుల కోసం సంఘటిత పరిచే సంస్థలేవీ లేవు. ఇటు ఎంఐఎం అటు బీజేపి పార్టీలు రెండు శ్మశా నాలూ మూడు కబరస్తాన్‌లుగా పాతబస్తీ రాజకీ యాలను నడిపిస్తున్నాయి.ఒక రోడ్డు కోసం, ఒక నల్లాకోసం, ఒక బడికోసం పాతబస్తీలో ఒక్క ఆందోళన జరిగిన ఉదంతం ఎవరి జ్ఞాపకాల లోనూ లేదు. ఈ పరిస్థితి నగర పాలకులకు, రాష్ట్ర పాలకులకు చాలా ఆనందదాయకమని వేరే చెప్పనవసరం లేదు. పాతబస్తీ ముస్లింలకెవ్వరికీ ఎంఐఎం పట్ల పెద్దగా సదబిప్రాయం లేదు. ఎవ్వ రిని కదిలించినా యువతలో నిరుద్యోగాన్ని ప్రధా న సమస్యగా చెప్తారు. పాతబస్తీ హిందువుల పరి స్థీతి అంతే కావచ్చునను గానీ మూసీనది దాటి ఈవలికి వచ్చి ఏదో ఉపాధి చూసుకొని సాయం కాలం తిరిగి ఇల్లు చేరుకునే అవకాశం హిందువు లకు రవంత ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యో గాలు దొరకకపోవడమే కాదు, ప్రైవేట్ రంగం లోనూ ముస్లింలు చాలా వివక్ష ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…