తెలంగాణ అలాయ్ బలాయ్
క్రిష్టియన్ మిషనరీలు నడుపుతున్న పాఠశా లలు పాజిటివ్ విద్యను అందిస్తున్న దానికి మంచి నిదర్శనం. ఈ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు తమ మత విశ్వాసాన్ని నిర్ణయంచుకునే స్వతం త్రం ఉన్నది. హిందుత్వ శక్తులు ఖురాన్‌లోని ప్రతి కూల అంశాన్ని తోలగించమని ముస్లింలని ఎప్పు డూఅడుగుతూఉంటాయి.కాని ఏ ముస్లిం మేధావి కూడా దళిత, శూద్రుల్ని అణచివేసే గ్రంథాల గు రించి మాట్లాడదు. ఈ శక్తులు ఏ మతాన్నైనా రూపాన్ని,సారాన్నిమార్చుకోమని అడిగే అధికారం ఉన్నట్లు భావిస్తాయి. కాని అదే సమయంలో, ఎవ్వరైనా, చివరికి హిందూయిజం బాధితులు కూ డా ఆ మతంలోని రూపాన్ని సారాన్ని మార్చాలని అడగరాదని ఆలోచిస్తారు. హిందూ గ్రంథాలు శూద్ర, చండాల వంటి భాషను ఆ కులాలపట్ల ఉ పయోగిస్తున్న ఏ ఒక్కరూ వాటిని ప్రశ్నించడం లేదు. ఖురాన్ కాఫిర్ అనే పదాన్ని దేవున్ని నమ్మని వారిని సూచించడానికి వాడితే తీవ్ర అభ్యంతరం చేశారు. కాని ఇతర మత శక్తులు హిందూ గ్రం థాలు వాడిన భాషను ఏనాడు ప్రశ్నించలేదు. ఒక వేళ ఎవరైన ఇతర మత వేదికల మీంచి కులాన్ని ప్రస్తావిస్తే, అది హిందూయిజం అంతర్గత సమస్య గా త్రివాదన చేస్తారు. ఎదుటివారి మతాన్ని ప్రశ్ని స్తున్నపుడు,సొంత మత గ్రంథాల్ని గురించి మంచి చర్చకు ఎందుకు సిద్దపడరు? ఇలాంటి అవకాశం భిన్న మతాలున్న మన దేశంలోనే ఎందుకు సా ధ్యం కాదు? ఏ ముస్లిం పండితుడైనా ఇండియన్ నేషనలిస్టు చర్చలో ఏ ప్రాతిపదికపై ఆధారపడి రు గ్వేదం, గీతలకుచోటు దొరికిందో ఆని ఆధారంగా ఖురాన్, బైబిల్‌లకు కూడా చోటు అడిగితే బావుం డు. ఖురాన్, బైబిల్ ప్రబావంతో అనేకమంది బ్రిటీ ష్‌కి వ్యతిరేకంగా మారింది నిజం కాదా? జాతియ తావదం చర్చలో ప్రజల్లో సమానత్వభావాన్ని ప్ర బావితం చేసిన గ్రంథాల్ని తప్పకుండా చూడాలి. హీరోయిజం, పురుషాధిపత్యం అనేవే జాతీయ వాద విలువల్ని నిర్మించలేదు. దైనందిన జీవితాన్ని అభివృద్ది చేసుకోవడానికి త్యాగమయ సంస్కృతిలో నిర్మించబడ్డది.ఇండియన్ జాతీయవాదం అనేది హిందువుల ఆస్థి కాదు. అది ముస్లిం, క్రిష్టియన్, బౌద్దులు, అదేవిదంగా సిక్కులకు సంబందించింది ఈ జాతి వేదాలు, గీత, పురాణాల పుస్తక వార సత్వంవల్లనేఏకం కాలేదు.ఖురాన్, బైబిల్, వినయ పీఠిక, గురుగ్రంధ్ సాహిబ్, ఇంకా ఇతర అంశాల చేత ఏకం అయ్యింది. ముస్లిం సంస్థలు తన కార్య క్రమాల్ని విశాల రాశులకు విస్తరించడం వల్ల అనే క కొత్త సమస్యలు జాతి నిర్మాణంలో చర్చకు వస్తాయి.
-కంచ ఐలయ్య
రెండు లక్షలమంది ముస్లింలను బలి తీసుకున్న పోలీస్ యాక్షన్!
హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ యాక్షన్ సమ యంలో ఒక జాతి నరమేధ, అత్యాచార, విధ్వంస లేదా ఆస్తుల దురాక్రమణలపై ఒక నివేదిక
-పండిట్ సందర్‌లాల్, ఖాజీ మొహమ్మద్ అబ్దుల్ గఫర్
ఇప్పటి తరాలకు తెలిసినంత వరకు నిజాం కాలమంటే రజాకార్ల దౌర్జన్యాలే అన్నంతగా ప్రచా రం జరిగింది.. అదే చరిత్రగా రికార్డు అయింది. కాని పోలీస్ యాక్షన్ పేర ఇక్కడి ముస్లింలను ఊ చకోత కోశారని, ముస్లిం ఆడవాళ్లను వందలు, వేల సంఖ్యలో అత్యాచారాలు చేశారని, ముస్లింల ఇండ్లను, ఆస్తిపాస్తులను సర్వనాశనం చేశారని, దోచుకున్నారని, ఆక్రమించుకన్నారని తెలుసునా? ఆ దౌర్జన్యకాండ గురించి తెలిసిన పాతబస్తీ ముస లివాళ్లను కదిపితే, ఆ విషయాలు తెలిసిన,తెలు సుకున్నవాళ్లనుంచి సమాచారం సేకరిస్తే ఆరు ల క్షల మంది ముస్లింలు హత్య గురించిన సమా చారాన్ని అందిస్తుంది. ఈ రిపోర్టు తయారు చేసిన టీమ్ తిరిగింది రజాకార్లు లేని ఏరియాలో..అదే రజాకారు దౌర్జన్యాలు కొనసాగితే ప్రాంతాల్లో ము స్లింలపై హత్యకాండా ఇంకా అధికంగా జరిగి ఉండే అవకాశం ఉంది….
హైదరాబాద్ స్టేట్‌పై పోలీస్ యాక్షన్ సమ యంలో ఇక్కడ ముస్లింలపై జరిగిన హత్యాకాండ, లూటీలు, దహనాలు, మానభంగాల గురించి హై దరాబాద్‌లోని ఒక లాయర్ యూనిస్ సలీమ్ తె లుపగా పండిట్ సుందర్‌లాల్, ఖాజీ మహమ్మద్ అబ్దుల్ గఫర్ కలిసి మౌలనా ఆజాద్‌ను కలిశారు. మౌలానా ఆజాద్ ఈ విషయమంతా విని దు:ఖప డి రిపోర్ట్ తయారు చేయడంకోసం ఒక టీమ్‌ను హైదరాబాద్ స్టేట్‌కి పంపడానికి నెహ్రును ఒప్పిం చాడు. పండిట్ సందర్‌లాల్ నేతృత్వంలో ఖాజీ మహమ్మద్ అబ్దుల్ గఫార్, యూనిస్ సలీమ్‌ను అపాయింట్ చేశాడు. అయిష్టంగా సర్దార్ పటేల్ ఒప్పుకున్నాడు. హైదరాబాద్ స్టేట్‌లోని గ్రామాలు, జిల్లాలు ముఖ్యంగా మరఠ్వాడా ప్రాంతం, మరీ ముఖ్యంగా ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్, బీదర్‌లలో తిరిగి, చాలా ఎక్కువ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఎంతో సమా చారాన్ని సమకూర్చి సంపూర్ణమైన రిపోర్టు తయారు చేశారు. ఆ రిపోర్టును చూసి వల్లాభాయ్ పటేల్ మండిపడ్డాడు. తీవ్ర అయిస్టాన్ని వ్యక్తప రుస్తూ, భారత ప్రభుత్వానికి ఈ పర్యటనతోగాని రిపోర్ట్‌తోగాని ఏమీ సంబంధం లేదని ఖాజీ అబ్దు ల్ గఫార్‌కు ఒక లేఖ రాశాడు ‘భారత ప్రభుత్వం మిమ్మల్ని అధికారికంగా అక్కడికి పంపలేదు. మీ రు వెళ్లాలనుకున్నారు. కాబట్టి మీ ఖర్చులకు డ బ్బులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం మిమ్మల్ని గుడ్ విల్ మిషన్‌పై పంపించే ప్రశ్నే తలెత్తలేదు. మీ రిపోర్ట్‌ను, మీ ఆక్టివిటీస్‌ని గమనించిందేమంటే మీరు మీ ఎంక్వయిరీని పోలీస్ యాక్షన్ జరుగు తున్నప్పుడు గాని, దాని తర్వాత గాని పరిమితం చేశారు. దాంట్లో రజాకార్ల అకృత్యాల తీవ్రతను గాని, వాటి ఫలితాల గురించి గాని ఏమాత్రం ప్ర స్తావించలేదు. బహుశా ఇది మీరు పెట్టుకున్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్‌కి బైట కావచ్చు. అదే సమ యంలో మీ రిపోర్టులో మీరు ఎట్లా ఊహించినా మీ రిపోర్ట్ పరిధిలోకి రాని విషయాలను చేర్చారు. అతి తక్కువ కాలంలో మీరు చేసిన రోలింగ్ ఎంక్వయిరీ స్థానిక పాలక విధానపు విస్తృతమైన ఎంక్వయిరీలతో పోల్చినపుడు బ్యాలన్స్ కనబడ డం లేదు. చివరగా, మీరు ఆతృతతో ప్రవేశించిన ప్రదేశము అనుభవంతో కూడిన రాజనీతిజ్ఞత, పాలనా దక్షత వదిలిపెట్టాల్సింది.
ఈ మాటల వల్ల ఇండియన్ ఆర్మీ యొక్క రెస్పాన్సిబిలిటీని పూర్తిగా పటేల్ సమర్థించాడు. ఈ ఉత్తరాన్ని చూసి జనరల్ జెఎన్ చౌదరి, మిల టరీ గవర్నర్ ఆఫ్ హైదరాబాద్ పటేల్ సెక్రటరీ 14 మార్చి 1949లో రాసిన ఉత్తరంలో తన హ ర్షాన్ని వ్యక్తం చేయకుండా ఆపుకోలేకపోయాడు ఇంతవరకు తనకు ఇంత తృప్తి ఎప్పుడూ కలగ లేదు అని రాశాడు. ముస్లింలపై సర్దార్ పటేల్ వ్యతిరేకత అందరికీ తెలిసిందే. జాతీయోద్యమం లో అతడి ముస్లిం వ్యతిరేక పాత్ర తెలిస్తే ఈ రిపో ర్ట్‌లోని అంశాల్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఇంకా చెప్పాలంటే అతడు ఆరెస్సెస్ భావజాలంతో ప్రభావితమయ్యాడు. యూసుఫ్ సలీమ్, ప్రోపెసర్ ముజీబ్ రిజావీ ఈ ఇన్వెస్ఠిగేషన్ టీమ్‌ని భారత ప్రభుత్వమే పంపిం చిందనిచెప్పారు. అసలు ఆ టైంలో ఎవరిని కూడా మిలిట్రీ అథారిటీ పర్మిషన్ లేకుండా రానీయడం గాని, పోనీయడంగాని అసంభవంగా ఉండేది. హైదరాబాద్ స్టేట్ లోపలకూడా కదలికలు కూడా గట్టి నియంత్రణలో ఉండేవి. కాని వాళ్లు రాష్ట్ర ప్ర భుత్వ అతిథి గృహాల్లోనే బస చేశారు. ఇది కూడా ఒక ఉదాహరణ. అయితే పటేల్ ఇటువంటి, ఇం తవిమర్శనాత్మక రిపోర్ట్‌వస్తుందనిఅనుకోలేదు. ఈ ఇన్వేస్టిగేషన్ టీమ్‌లోని ఇద్దరు సభ్యులను భారత ప్రభుత్వం వెంటనే బాధితులను చేసింది. ఖాజీ అబ్ధుల్ గఫార్‌ని ఈజిప్ట్‌కిగాని సిరియకిగాని ఇండి యన్ అంబాసడర్‌గా నియమించకుండా పటేల్ నెహ్రుమీద వత్తిడి తీసుకువచ్చాడు. అప్పటికి స్టేట్ ఆటర్నిగా ఉన్న యూనిస్ సలీమ్‌ని నిందలు వేసి ఆ పదవి నుంచి తొలగించారు. అధికారికంగా సృష్టించిన ఇటువంటి భయాందోళనా పరిస్థితుల్లో ఈ రిపోర్ట్ కలిగిన ప్రభుత్వాధికారులు వాటిని వదిలించుకున్నారు. అయినా ఇప్పటికీ ఒక ప్రతి ఇండియన్ హోం మినిస్ట్రీలో ఉంది.
-వేముల ఎల్లయ్య, స్కైబాబ
ఇంకావుంది…