తెలంగాణ అలాయ్ బలాయ్ 17th
కొందరు వాదిస్తున్నట్లుగా మతమే ముస్లింల వెనుకబాటుకు కారణమా? లేక వారిపట్ల చూపిన పక్షపాతం కారణమా? అవథ్, వాయవ్య సరిహద్దు ప్రాంతంలో విద్యలో వారి ప్రాతినిధ్యం తగినంత గా ఎలా వుందో, బెంగాల్‌లో తగినంతగా ఎందు కు లేదో అర్థం చేసుకోవడం కష్టమనే వాదనలు కూడా చేస్తున్నారు. గతంలో చెప్పుకున్నట్లు వారి రాష్ట్రాలలో వారి సామాజిక పునాదే దానికి కార ణం. మనం దళితులు,వెనుకబడిన హిందూవు లను పరిశీలిస్తే విద్య, ప్రభుత్వ సర్వీస్‌లలో వారి ప్రాతినిధ్యం కూడా చాలా తక్కువగానే ఉంటోంది.
ఆర్థికరంగంలో ముస్లింలు వెనుకబడి వుండటానికి మరో ముఖ్యమైన అంశాన్ని కూడా పరిశీలించాలి. మధ్యయుగపు భారతదేశంలో ముస్లిం పాలకవర్గా లు ప్రధానంగా ప్యూడల్ ప్రభువులుగా వుండేవా రు. వారి ప్రాభవం ఎస్టేట్లపైన, రైతుల నుంచి వ సూలు చేసే వ్యవసాయిక మిగులుపైనా ఆధార పడి వుండేది. ప్రారంభంలో వారిలో పారిశ్రామిక వేత్తలు లేరు. సుల్తాన్‌లు లేదా మొగల్ కాలంలో కూడా అర్థికశాఖ ప్రధానంగా హిందువు చేతిలో వుండేదని ప్రముఖ చరిత్రకారుడు టాయన్‌బి గమ నించారు. ప్యూడల్ ఆర్థికవ్యవస్థ రావడంతో ప్యూడలిజం బలహీనపడింది. జమీందారీ విధా నం రద్దుతో వారి ఆర్థికపట్టు కూడా పోవడంలో ఆశ్చర్య పడాల్సిందేమి లేదు. తమకు అనుభవం, ఆసక్తి లేకపోవడంతో ముస్లింలలో జాగీర్దారులు, జమీందారులు అధునిక వాణిజ్యం, పరిశ్రమలను చేపట్టలేకపోయారు. వారిలో అనేకులు అప్పులో కూరుకుపోయారు. ఉత్తర లేదా తూర్పు భారత దేశానికి చెందిన ఏ ఒక్క ముస్లిం కూడా పెద్ద పరి శ్రమకు లేదా వాణిజ్యసంస్థకు అధిపతిగా లేరు.
మరోవైపు హిందువులలో పలువురు వర్తకులుగా వుండేవారు. మధ్యయుగంలో ప్రధానంగా వారు వర్తకం చేసేవారు. ఆంగ్లేయులు తమ పాలనను ప్రారంభించిన ఆధునిక పారిశ్రామిక ఉత్పత్తి వ్యవస్థనే ప్రవేశపెట్టారు. దానిని హిందువులు ఎలాంటి సంకోచం లేకుండా చేపట్టారు.వారు త్వరలోనే బట్టల మిల్లులు, ఇతర పరిశ్రమలు స్థాపించారు. ముస్లింలలో అలాంటి స్పూర్తి మనకు కన్పించదు. టాటాలు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థలను నెలకొల్పారు. ఉక్కు పరి శ్రమలలో కిలకపాత్రను నిర్వహించారు. హిందు వులలో కూడా అన్ని ప్రాంతాలలో ఇదేరకమైన ధోరణి కన్పించదు. అది కేవలం రాజస్తాన్, గుజ రాత్, పంజాబ్‌లలో కన్పిస్తుంది. అక్కడ ప్రధా నంగా వాణిజ్యం బనియాలు, మర్వాడీల చేతిలో వుండటమే అందుకు కారణం. ముస్లిం ఉన్నత వగ్గాల వలనే బ్రహ్మణులు కూడా వాణిజ్య స్పూర్తి ని పెంపోందించుకోలేదు. అయితే ముస్లిం జమీం దార్ల మాదిరిగా వారు ప్యూడల్ సంప్రదాయాల భారాన్ని మోయలేదు. వారు త్వరితంగా ఆధునిక విద్యను చేపట్టారు. ఆ రంగంలో వారు బాగా అభి వృద్ది చెందారు. వారు ఆర్థికరంగంలో రాణించ లేకపోయినా సంస్కృతి, విద్యారంగంలో ప్రాచు ర్యాన్ని సంపాదించారు.
సమకాలీన భారతదేశంలో ముస్లింల వెనుకబాటుతనం
కాని ఉత్తర భారతదేశంలోని మునుపటి పాలక వార్గాలు ప్రధానంగా నవాడులు, జాగీర్దా రులు, తాలక్‌దార్లుగా ఉన్న ప్యూడల్ కుటుంబాలు పాకిస్తాన్‌కు వలస వెళ్లాయి. వృత్తిదారులు ఉన్నత విద్యావంతులు, నైపుణ్యం కలిగిన మధ్యతరగతి వర్గాలు మెరుగైన అవకాశాలను కాంక్షిస్తు ఉత్తర, పశ్చిమ భారతదేశంలో నుంచి పాకిస్తాన్‌కు వలస వెళ్లారు.హైదరాబాద్ నుంచి మినహా దక్షిణభారత దేశంలో నుంచి అతి తక్కువ మంది ముస్లింలు పాకిస్తాన్ కు వలస వెళ్లారనే అంశాన్ని గమ నించాలి. ఉత్తర, వాయవ్య భారతదేశం నుంచి, పశ్చిమ భారతదేశం నుంచి పెద్దఎత్తున ప్రజలు పాకిస్తాన్‌కు వలస వెళ్లారు. పశ్చిమ భారతదేశం నుంచి కొందరు వర్తకులు పాకిస్తాన్ వలస వెళ్లిన అనంతరం అలాంటి వలసవల్ల తమకు పెద్దగా ప్రయోజనమేమి వుండదని భావించి చిన్న వర్త కులు ఇక్కడే వుండిపోయారు. కష్టపడి పనిచే యడం, భారతదేశం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రయోజనం పొంది నేడు వారు కొంతమేరకు అభివృద్ది చెందారు. నేడు ఈ వ్యాపా ర వర్గాలే ముస్లింలలో ధనికులుగా వున్నారు. పాకిస్తాన్‌కు వలస పోవడమనేది ధనిక, ఉన్నత వర్గాల ముస్లింలకే పరిమితమయింది. భారత దేశంలో మిగిలిపోయిన ముస్లింలు బెనారస్, అలీ ఘర్, మురాదాబాద్, పిరోజాబాద్, ఆగ్రా, మీరట్, దేవబాండ్, షహరాన్‌పూర్ వంటి చిన్న, మద్యత రహా పట్టణాలకు చెందిన చేతి వృత్తుల వారు, గ్రా మీణ ప్రాంతాలకు చెందిన చిన్న, సన్నకారు రైతు లు వున్నారు.వలసలు ప్రధానంగా పట్టణ ప్రాంతా ల నుంచే జరిగాయని, గ్రామీణ ప్రాంతాల నుంచి జరగలేదని చెప్పనవసరం లేదు. దీనికి ప్రధానమై న ఒక కారణం ఆర్థికపరమైనది. ‘సంస్కృతిక బం ధనాలు’ కూడా ఒక కారణంగా వుంది. గ్రామీణ ప్రాంతాలలో వారికంటే పట్టణ ప్రాంతాల వారికి ఇవి తక్కువగా వున్నాయి. సాంస్కృతికంగా పెనవే సుకుపోయిన వ్యక్తి వలస వెళ్లడానికి ఇష్టపడరు. అలాగే టాగావాలలు, కూ లీలు, రిక్షా తొక్కేవారు, మోటార్ మెకానిక్‌లు, తోటమాలులు, సమాధులు త్రవ్వేవారు, భిక్షగాళ్లు, నేతపనివాళ్లు, కసాబులు, తేలీలు, తంబోలీలు తదితరులు ఎలాంటి ప్రమో జనం వుండదు గనుక వారు పాకిస్తాన్‌కు వలస వెళ్లలేదు.
నేడు భారతదేశంలో ముస్లింలు వెనుకబడి వుండడానికి చారిత్రాత్మక కారణాలున్నాయి. భారత దేశ విభజన అనేది దీనికి సంబందించి వాటర్‌షెడ్‌కు తక్కువైనదేమి కాదు. దేశవిభజనకు ముందు భారతీయ ముస్లింలలో వెనుకబాటుతనం లేదని కాదు. అప్పుడు కూడా వుంది. వాస్తవానికి ఇస్లాం మతాన్ని స్వీకరించినవారిలో అత్యదికులు వెనుకబడిన కులాలకు చెందినవారేనని రూపం ఇంతముందే చెప్పుకున్నాము. వారు తమ ఆర్థిక, సాంస్కృతిక వారసత్వంలో సహా ఇస్లాంను స్వీక రించారు. బెంగాల్, పంజాబ్, సిందూ వంటి చో ట్ల పేదరికం అమితంగా వుండేది. అదే సమయం లో మంచి సంపన్నులైన, పలుకుబడి గల ముస్లిం లు కూడా వుండేవారు. వీరు పేద.అదే వెనుకబ డిన ముస్లింలను వదిలేసి భారతదేశం నుంచి వల స వెళ్లిపోయారు.దిగువ కుల ముస్లింల లోని జు ల్హాలు, కసాబ్, మురాదాబాద్‌లోని ఇత్తడి పనివా రు, మాలీలు నేడు సంపన్నులుగా వున్నారు బెనా రస్, అజాంఘర్, మానాథ్ భంజన్, భివాంగీ, మాలేగావ్‌లకు చెందిన పలువురు అన్సారీలు నేడు వున్నారు. మహారాష్ట్రకు చెందిన బఘబన్‌లు తమ కూరగాయలు, పండ్ల వ్యాపారాన్ని దేశం మొత్తా నికి విస్తరించారు. రాజస్తాన్‌కు చెందిన మాసన్లు నిర్మాణ పనులను, ఖురేషీలు మాంసం వ్యాపారిన్ని చేపట్టారు.భారతీయ ముస్లింలు, వారి అర్థిక ప్రగ తికి సంబం దించినంతవరకు ఈ విధంగా వుండి వారు పెద్ద వ్యాపారం, పరిశ్రమల రంగంలోకి ప్ర వేశించ లేక పోయారు. ప్రతి సంవత్సరం ప్రచు రితమయ్యే 200 పెద్ద భారతీయ పరిశ్రమలు ము స్లింలలో అక్ష రాస్యతా స్థాయి కూడా చాలా నిరాశ కల్గించే వి ధంగా వుంది.అక్షరాస్యతా స్థాయి హిం దువులు కంటే కూడా క్రైస్తవులలొ అధికంగా వుంది. భారతదేశ జనాబా 2 శాతంగా వున్న క్రైస్త వులలొ పట్టణ ప్రాంతాలలొనూ కూడా అదికంగా వుంది.కనుకముస్లింలు విద్య విషయంలో సాధిం చాల్సింది చాలావుంది. ఇది ముస్లింలకు విచారక రమైనది, ఆశ్చర్యకరమైనది కాదా? ప్రతి ముస్లిం ్లపురుషుడు, ముస్లిం స్త్రీల విజ్ఞానాన్ని సంపాదించు కోవడం తప్పనిసరి అని ప్రవక్త చెప్పారు. కానీ సె ౖద్దాంతిక ఆకాంక్షలకు , సంపాదించుకోవడం తప్ప నిసరి అని ప్రవక్తచెప్పారు. కానీసైద్దాంతికఆకాంక్ష లకు , వారసత్వానికి చాలా తేడావుంది. ఇస్లాంను స్వీకరించినవారిలో అత్యధికులు నిమ్న కులాలకు చెందివారని ,వారు తమ సొంత సంస్కృతితో సహా వచ్చారని చెప్పుకున్నాము . ఆ సాంస్కృతిక వారస త్వం నేటికి వారిని క్రుంగదీస్తోంది.
దురదృష్టవశాత్తు మౌల్వీలు , ముల్లాలలో అత్యది కులు అధి సామాజిక స్థితినుంచి వచ్చినందున వా రు పూర్తిగా వెనుకమబడిన దృష్టికోణాన్ని కలిగి వున్నారు.వారి వెనుకబడిన సామాజిక మూలం వ ల్లనే వారి దృష్టికోణం కూడా ఆ విధంగనే వుం టొంది. ఇది ఒక విషవలయంగా మారింది.దాని నుంచి బయటపడటం చాలా కష్టం .ఆధునిక లౌ కిక విద్య కంటే మదర్సా విద్య వారిలో ప్రాచు ర్యం. పొందటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…