తెలంగాణ ఇవ్వకుంటే మా దారి మేం చూసుకుంటాం గుత్తా
నల్గొండ: నవంబర్ 5(జనంసాక్షి):
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏదో ఒకటి తేల్చకుంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలంతా తమదారి తాము చూసుకోక తప్పదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు, ఆయన సోమవారం మాట్టాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ,ఈవిషయంలో ఇంకా జాప్యం చేయడం తగదన్నారు రాష్ట్ర ఏర్పాటు అనేది ఏ ఒక్కరి అభిప్రాయమో కాదనీ,నాలుగున్నర కోట్ట తెలంగాణ ప్రాంత ప్రజల ఆక్షాంక్ష అని,దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు, అందువల్ల ఇకేమాత్రం ఆలస్యం
చేయకుండా తక్షణం రాష్ట్రాన్ని ఏర్పాటును ప్రకటించారలన్నారు. ఒకవేళ తెలంగాణ పై కాంగ్రెస్ ఇంకా నాన్చుడి ధోరణిని అవలంభిస్తే మాత్రం ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలంతా తమ దారితాము చూసుకోక తప్పదన్నారు అలాంటి వారిలో తాను కూడా ఉన్నానని చెప్పుకోచ్చారు, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టాలంటే ఖచ్చి తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని చెప్పుకొచ్చారు, తెలంగాణ ఇవ్వకుంటే ఒఈ ప్రాంతంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు.తెలంగాణ ఇస్తే మేం టికెట్టు కూడా అడగం అని ఆని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని,పార్టీని బతికించుకోవాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందే నన్నారు.
దశాబ్దాలుగా తెలంగాణపై కేంద్రం వివక్షత చూపుతోందని, ఇటీవల కేంద్రంలో జరిగిన మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో సైతం సీమాంద్ర ఎంపీలకే ప్రాధాన్యత దక్కిందని సోమావారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడిన నల్గోండ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీలకు
స్వతంత్ర హోదాగల సహయమంత్రి పదవులు, తెలంగాణ ఎంపీలకు సహయమంత్రి పదవులనిచ్చారని,
జైపాల్ రెడ్డి ని ప్రాధాన్య నుంచి తప్పించి ప్రజలతో సంభంధం లేని శాఖ ఇచ్చారని గుత్తా చెప్పారు….
కేంద్ర మంత్రివర్గ విస్తరణే అందుకు ఉదాహారణ అని చప్పారు,తెలంగాణ ప్రాంతం వారికి సహాయ మంత్రిత్వ శాఖను కట్టబెట్టి సీమాంద్రుతకే పెద్దపీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జైపాల్‌రెడ్డికి కూడా ప్రజలతో సంబంధంలేని శాఖను ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ముఖ్కమంత్రి, స్పీకర్, శాసనమండలి అధ్యక్షుడు, పీసిసి అధ్యక్ష పదవి సీమాంధ్రులకే దక్కా యాంటూ ఇంతా వివక్ష చూపినా తాము భరిస్తామని అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చితీరాలని గుత్తా పట్టుబట్టారు