తెలంగాణ ఉద్యమం… భూమి పుత్రుల ఉద్యమం…
గోదావరిఖనిటౌన్, జులై 21, (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేపడుతున్న ఉద్యమం భూమి పుత్రుల ఉద్యమమని తెలంగాణ జేఏసీి రాష్ట్ర కో ఆర్డి నేటర్ పిట్టల రవీందర్ అన్నారు. శనివారం స్థానిక సిరి ఫంక్షన్ హాల్‌లో జరిగిన రామగుం డం నియోజక వర్గ జేఏసి విస్తృతస్థాయి సమావే శానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలం గాణ ఉద్యమంలో భాగంగా గతంలో హైదరా బాద్‌లో జరిపిన మిలియన్ మార్చ్ తరహాలో సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్‌ను చేపట్టను న్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ మార్చ్ విషయమై రాష్ట్ర జేఏసి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలోని నియోజక వర్గాల వారీగా జేఏసీలతో సమావేశాలు జరుపుతున్నట్లు ఆయన అన్నారు. క్షేత్రస్థాయి నుంచి జేఏసిని బలప రుస్తు… ఈసారి తెలంగాణ విషయమై తాడో పేడో తేల్చుకునే విషయమై మలిదశ చివరి ఉద్యమంగా తెలంగాణ మార్చ్‌ను జరపత లపెట్టినట్లు ఆయన అన్నారు. తెలంగాణ మార్చ్ విషయమై తెలంగాణ జేఏసిలో ఉన్న 28సం ఘాలు తదితర పక్షాల నిర్ణయం మేరకు ఈ ఉద్యమాన్ని జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న టువంటి రాజకీయపార్టీలను ఎదుర్కునేందుకు జేఏసి సిద్దంగా ఉందని… తెలంగాణ ఉద్యమమే కాకుండా ఈ ప్రాంత ప్రజల స్థానిక సమస్యలపై కూడా… జేఏసి దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారానికి సుధీర్ఘకాల పోరాటాన్ని చేపట్ట నున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ మార్చ్ విజయవంతం కోసం జేఏసిలో ఇప్పటికి ఉన్న లోపాలను సవరించుకుని… మార్చ్ విజయవం తం దిశగా కొనసాగించడానికి క్షేత్రస్థాయి నుం చి విస్తృత సమావేశాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సకలజనుల సమ్మెలో సింగరేణి కార్మి కులు పాల్గొని ఉద్యమ దిక్సూచిలుగా నిలిచా రన్నారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు కేవలం జేఏసి బాధ్యులే కాకుండా రైతులు, మహిళలు, ఆదివాసులు, వారి సంఘా ల బాధ్యులు, దళిత శక్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకువచ్చి కృషి చేస్తా మని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలం గాణ మార్చ్ తెలంగాణ పట్ల వ్యతిరేకంగా ఉన్న శక్తులకు వణుకు పుట్టేలా… చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి విజయవంతం చేయా లని ఆయన కోరారు. ఈ సమావేశంలో జేఏసి బాధ్యులు జేవి.రాజు, మల్లవజ్జుల విజయానంద్, చల్లా ప్రవీణ్, కోరుకంటి చందర్, కొత్తకాపు సుధాకర్‌రెడ్డి, పెంటరాజేష్, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్, తోడేటి శంకర్‌గౌడ్‌లతో పాటు మహిళా నాయకురాళ్ళు పోలుసాని సులో చనరావు, కళావతి, పిఓడబ్ల్యూ సంధ్య తదిత రులు పాల్గొన్నారు.