తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా రంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంస్కృతిక కళాకారులకు సన్మానం
పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసా
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారత దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం సిద్దించగా, తెలంగాణ ప్రాంతం మాత్రం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందన్నారు. ఇది జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, స్వామి రామానందతీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వేంకటేశ్వర్ రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీమూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దామన్నారు.
ఏడాది పొడుగునా ఈ ఉత్సవాలు కొనసాగనుండగా, సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడం జరిగిందన్నారు. యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొని మనమంతా భారతీయులం అనే స్ఫూర్తిని చాటారని మంత్రి పొగిడారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసినందుకు ప్రజా ప్రతినిధులను, అధికారులను, విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను మంత్రి అభినందించారు.
అంతకు ముందు కళాకారులైన చదువుల శివరాములు-వీధీ భాగవతం, మిర్యాల అంజయ్య-యక్షగానం, కళ్ళెం భారతమ్మ-తాంబూరా కథ గానం, అబ్బారి వెంకటస్వామి-రంగస్థల యాక్టర్, వానరాశి వెంకటమ్మ-తాంబూరా కథ గానం,టి.క్రాంతి నారాయణ-కూచిపూడి డాన్సర్, దేశ భక్తి జానపద కళాకారులైన: టి.శివకుమార్, టి.జయరామ్, కె.రమేష్, టి.వెంకటేశ్, ఈ.నర్సింలు, భీమయ్య, ఎ.భిక్షపతి, జె.యాదయ్య, ఎమ్.మోహన్, ఆర్.నరేష్, యు.వసంత, జి.సంధ్య, వై.భార్గవి, టి.సునీతలను మంత్రి సన్మానించారు
ఈ కార్యక్రమంలో ఎమ్యెల్సీ దయానంద్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, శాసన సభ్యులు కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీఓలు వెంకటాచారి, రాజేశ్వరి, చంద్రకళ, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, కళాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
4 Attachments • Scanned by Gmail
|