తెలంగాణ తొలి పొద్దు కాళోజీ నారాయణరావు
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ తొలి పొద్దు కాళోజీ నారాయణరావు అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షకులు పెద్దపంగ పూర్ణ శశికాంత్ అన్నారు.స్థానిక లయన్స్ క్లబ్ సర్వీస్ సెంటర్ నందు హోప్ స్వచ్ఛంద సేవా సమితి , సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని కవి సమ్మేళనంను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ రచనలు, కవిత్వం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అగ్రభాగాన ఉంచిన గొప్ప కవి అని కొనియాడారు.నిజాం నిరంకుశ , అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కలం, గళం ద్వారా తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప అక్షర యోధుడని అన్నారు.ఒక నిప్పు కనిక, ప్రజల గొడవే నా గొడవ అని సమసమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు.దైద వెంకన్న మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు ప్రజా కవి, రచయిత, సామాజిక వేత్తగా తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప మానవతామూర్తి అని అన్నారు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని సగర్వంగా ప్రకటించిన మేధావి అని పేర్కొన్నారు.నిజాం నిరంకుశ పాలన విముక్తికై విశేషమైన కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీద జాతీయ పురస్కారం, వైద్య ఆరోగ్య యూనివర్సిటీ ఏర్పాటు చేసి సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు.ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు, కళాకారులకు, సామాజిక, సాహితివేత్తలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో హోప్, సింధు ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి దైద అనిత, ప్రముఖ కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజా, భానుపురి సాహిత్య వేదిక అధ్యక్షులు పోతుగంటి వీరాచారి, కుసుమ సిద్ధారెడ్డి , అలీముద్దీన్ , లింగాల శ్రీనివాస్, ప్రముఖ కార్టూనిస్టు శిరంశెట్టి ఆనందరావు , అవిలేన్, సీనియర్ ,జర్నలిస్టులు బంటు కృష్ణ , కందుకూరి యాదగిరి, జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు , వల్లపట్ల అబ్రహం, డాక్టర్ ఏబల్ శశి, హైమావతి, కళాకారులు విమల ,కళ్యాణి పాల్గొన్నారు.