తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 చీకటి రోజు

పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వి

టేకులపల్లి, సెప్టెంబర్ 17( జనం సాక్షి): హింస,దౌర్జన్యం,హత్యలు హత్యాచారాలతో తెలంగాణ ప్రజలను వంచించి తెలంగాణ భూభాగాన్ని 74 ఏళ్ల క్రితం దురాక్రమణ చేసిన రోజు ఇదే (17 సెప్టెంబర్,1948 )అని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ అన్నారు. శనివారం టేకులపల్లి లో పి డి యస్ యూ ఆధ్వర్యంలో విద్రోహ దినం సందర్భంగా సదస్సు పి డి యస్ యూ జిల్లా నాయకులు ఎ. పార్థసారథి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దేశంలో 1948 సెప్టెంబర్ 17న జరిగిన దుర్ఘటనపై వివిధ రకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు జరిగింది ముమ్మాటికి విద్రోహమేనని,తెలంగాణ ప్రజలకు చీకటి రోజుగానే మిగిలిపోయిందని వారు అన్నారు. ఎందుకంటే నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అణచివేయడం కోసం కమ్యూనిస్టులు ఏర్పరిచిన 3000 గ్రామాల లో జనతా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు నిజాం నవాబు భారత్ సైన్యాలతో చీకటి రహస్య ఒప్పందాన్ని చేసుకొని వేలాది మంది మహిళలను చరిచి, వేలాది మంది కమ్యూనిస్టు విప్లవకారులను ప్రజలను హత్య చేసిన సందర్భాన్ని నేడు మన పాలకులు వేడుకలు జరుపుకోవడం దుర్మార్గం అని వారు అన్నారు. తెలంగాణ వాస్తవ చరిత్ర పై మన్ను కప్పుతున్నారని, అప్పట్లో జరిగిన ఘోరాలు, హత్యలు, అత్యాచారాలు దాస్తే దాగని చరిత్ర ఒక చారిత్రక సత్యమని వారు తెలియజేశారు. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్న పాలకుల మాయమాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని వేడుకలు,అంగు ఆర్భాటాలతో రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిని మించి ఒకరు ప్రచారాలను విస్తృతంగా చేస్తున్నారని, ఈ క్రమంలో ప్రదర్శీల వాదులు, విద్యార్థులు ,మేధావులు ప్రజలు వాస్తవ చరిత్రనే అవ�