తెలంగాణ ప్రభుత్వం వృద్దుల సంక్షేమ పథకాలు భేష్
పాల్గొన్న జగిత్యాల జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ,అడిషనల్ కలెక్టర్లు అరుణ శ్రీ,లత
జగిత్యాల (జనంసాక్షి ) అక్టోబర్ 01
ఈ సందర్బంగా చైర్మన్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి,భద్రతకు,వారు గౌరవంగా జీవించేందుకు అవసరమైన సహాయం అందిస్తుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వృద్దులకు నేనున్నానంటూ ఇంటికి పెద్దకొడుకు వలే ఆదుకుంటూ ఆసరాగా నిలుస్తున్నారు.రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ద్వారా వృద్దులకు నెలకు 2016/- అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ, ముఖ్యమంత్రి ఒక్క కెసిఆర్ గారు మాత్రమే.రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కరీంనగర్,రంగారెడ్డి జిల్లాలో వృద్ధాశ్రమాలు నడుపబడుతున్నాయి.వయోవృద్ధుల సహాయార్ధం 14567 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడమైనది.కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ,డి డబ్ల్యూ ఓ నరేష్ ,జిల్లాల సంక్షేమ అధికారులు, సీనియర్ సిటిజన్స్, ప్రతినిధులు పాల్గొన్నారు.