తెలంగాణ ముస్లిం సాహిత్యం పోలీస్ యాక్షన్: డాక్టర్ జైమీ జ్ఞాపకాలు
కాంగ్రెస్ వాలంటీరుగా పనిచేయటం వలన మా గ్రామ ప్రజలు అత నిని చోటా గాంధీ అని పిలిచేవారు. రజాకార్లు మంచి జోరులో ఉన్న ప్పుడు ధర్మారెడ్డి కుటుంబం నిజాంబాద్ పట్నంలో ఉంది. అయితే రజాకార్లు వారి ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తుల్ని లూఠీ చేయటా నికి ప్లాన్ వేశారు. ఈ సంగతి కనుక్కున్న ధర్మారెడ్డి నన్ను నిజాంబా ద్‌కు పిలిపించి నా సలహా, నా సహాయం అడిగాడు, నేను ఒక టాక్సీకారు కిరాయికి తీసుకువచ్చి అండ్ల ఆయన పిల్లలను, ఆడ వాళ్లను, డబ్బులను, బంగారాన్ని వేసుకొని, దైర్యంగా కారులో వారి తో పాటు నేను కూడా కూచుని మా గ్రామం కొరట్ పల్లికి వార్ని చేర్చాను. అట్లా నావల్ల వారందరి ధన, మాన, ప్రాణాలు కాపాడబ డినాయి. రజాకార్లు ఊళ్లమీద కొచ్చి దాడులు చేస్తున్నారు. మా ఊళ్లో భగ్వాన్ రావ్ అనే ఒక బావనాయన ఉండేవాడు. చాలా పెద్ద కుటుంబం. బాగా చదువుకొన్నొళ్లు, ఆడోళ్లు మొగోళ్లు అందరూ చదువుకొన్కోళ్లే, ఒక రాజు రజాకార్లు రాత్రికి వస్తున్నామని ఇల్లు లూఠీ తగల పెడ్తామని, ఆడవాళ్లకు ఎత్కుకపోతామని వార్నింగ్ పంపారు. ఆ భగ్వన్‌రావ్ మా ఇంటికి ఉరికొచ్చి సంగతంతా నాకు చెప్పాడు. భయపడకు నేనున్నాను కదా అని ఆయనకు ధైర్యం చెప్పి ఆరోజు సాయంత్రం నాల్గు గంటల నుండే వారి ఇంటి ముంగల మంచం వేసుకొని, కాపాలా కూచున్నా. వీరెవరూ ఇవతలికి రాకం డ్రే లోపలే ఉండండ్రి అని భరోసా ఇచ్చిన, రాత్రి పది గంటలకు రజాకార్లు వచ్చిండ్రు, తాగి ఉన్నారు. ఎగురుతుండ్రు దుంకు తుండ్రు. పాటలు పాడుతుండ్రు. చేయలల్ల తల్వార్లు, జించియాలు, బందూకులు, గుత్పలు. నేను వాళ్లను ఆపిన, ఎందుకొచ్చిన్రని సవా ల్ చేసిన. ”తూకోన్ హై బే. రోక్‌నే వాలా, హిందువొంకే మదద్ కర్తాహై” అని మీది మీది కొచ్చిండ్రు.
” ఈ భగ్వాన్‌రావ్ తన జింతగేల్ ఎప్పుడూ ముస్లింలను సతాయిం చలే. జులుం చేయలే. దేవుడులాంటోడు. అలాంటి మనిషి మీకేం లుక్సాన్ చేసిండు. ఎందుకు హమ్ల చేస్తుండ్రు. ముందు నన్ను చంపి నా లాష్‌ను తొక్కుకుంట ఇంట్లకు పోండ్రి అని మొండికేసిన వాల్ల తొవ్వకు అడ్డం పండుకున్న. ఇంతలో మా ఊరి కుర్రోళ్లు కూడా అక్కడికి వొచ్చిండ్రు. బాగా బహెస్ అయ్యింది. ఆ వొచ్చినోళ్లందరూ మా ఇరుగుపొరుగోళ్లే, ఆఖరికి వాళ్లు ఫిర్ దేఖ్ లేయింగే అనుకుం టూ వాసస్ పోయిండ్రు.
ఇక ఆ తర్వాత పోలీస్ యాక్షన్ జరిగింది. మిలిటరీ వారి ప్రోత్సా హంతో రెచ్చిపోయి ముస్లింల ఇండ్లను హిందువులు దోచుకు న్నారు. పునాదులతో సహా కూలగొట్టి నేల మట్టం చేశారు. స్త్రీలను ఎత్తుకపోయి దూరదూర ప్రాంతాలలో దాచుకున్నారు. నాందేడ్, జాల్నా- పర్బనీ, బీజ్ జిల్లాల నుండి ఎక్తుకొచ్చిన స్త్రీలను నిజాంబాద్ ఇండ్లల్ల దాచుకున్నారు. టికి చేరుకుంది. పంజరాన్ని వీడిన పక్షి ఆకాశాన్ని తన ఇల్లులా చేసుకుంది. పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత. చాలా రోజులకు నేను ఒక హిందు వుల ఇంటికి వైద్యం చేయటానికి వెళ్లాను. ఆ ఇంట్లో రోగి ఒక స్త్రీ అల్లా అల్లా అని అరుస్తుంది. దానితో నాకు అసలు సంగతి అర్థం అయ్యింది. రెండు మూడు సార్లు ఆ మరీజ్‌ను ‘ట్రీట్‌మెంట్ చేయటా న్కి వాళ్లింట్లో కల్సిన, ఒక సారి ఎవరూ లేనపుడు ఆమె తన సంగతు లన్నీ, విప్పిచెప్పింది.
ఆమె దురద్వాడా ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం. బీదర్ దగ్గరి ఉద్గీరో ఆమె స్వగ్రామం. వయస్సు 20-25 మధ్యల ఉంటుంది. వివాహిత భర్త పిల్లలు. శాంతి సౌఖ్యాలతో ఉండేది. ఇంతల పోలీస్ యాక్షన్ జరిగింది. మిలిటరీ బీదర్ నుండి ఉద్గీర్‌లోకి ప్రవేశించింది. రెండు రోజుల క్రిందనే సైన్యం వస్తుందని పుకార్లు బయలు దేరి చాలా ముస్లిం కుటుంబం మాత్రం అమాయకంగా మేమేం పాపా లు, అన్యాయాలు ఎవరికి చేయలేదు. మాకేం కాదు. మమ్మల్ని ఎవరూ ఏం చేయరు. అని అల్లా మీది భరోసాతో ఆమె కుటుంబం అలానే ఉండిపోయింది.
పరవస్తూ లోకేశ్వర్